" ధ్యానం ద్వారా మెడిసిన్‍లో సీటు "

 

 

నా పేరు "ప్రియదర్శిని". నేను పదవతరగతి వరకు "లిటిల్ రోస్ హైస్కూల్" లో చదివాను. స్కూల్‌లో చదివేటప్పుడు స్కూల్ వ్యవస్థాపకులు డా|| B. గోపాలకృష్ణమూర్తి సార్, రాధికా మేడమ్ గార్ల ప్రోద్బలంతో స్కూల్‌లో నిర్వహిస్తున్న "గౌతమబుద్ధా పిరమిడ్ హెల్త్ కేర్ సెంటర్"లో ధ్యానం చేసేదానిని.

 

స్కూల్‌లో చదివేటప్పుడే నాకు మూడవ కన్ను ఉత్తేజితమై ఎంతో మంది ఆస్ట్రల్ మాస్టర్స్‌ను కలిసి వారి సందేశాలను తీసుకోవడం జరిగింది! ధ్యానంలో ఎన్నో లోకాలను సందర్శించాను!

 

పదవి తరగతి పబ్లిక్ పరీక్షలలో ఖచ్చితంగా 10 పాయింట్లు రావాలని నేను ఆశిస్తే 9.8 పాయింట్లు వచ్చింది. ఏ మాత్రం నిరుత్సాహపడకుండా పేపర్ రీకౌంటింగ్ మరి వెరిఫికేషన్‌కు పంపించాను. అప్పుడు 10 పాయింట్లు వచ్చింది!

 

ఇంటర్ పూర్తి అయిన తరువాత డాక్టర్ కోర్స్ చేయాలని పట్టుదలతో చదివి ఎంసెట్ పరీక్షలు వ్రాశాను. "గౌతమబుద్ధా పిరమిడ్ కేర్ సెంటర్"లో గోపాలకృష్ణమూర్తి సార్‌కు, మేడమ్‌కూ నా లక్ష్యం గురించి చెప్పాను.

 

వారు దృఢ సంకల్పంతో రోజుకు అయిదు గంటల చొప్పున 41 రోజుల పాటు మధ్యలో ఒక్కరోజు కూడా ఆపకుండా ధ్యానం చేయాలనీ ఎటువంటి వికల్పం మరి వేరే ఆలోచనను దగ్గరకు రానీయకుండా గట్టి నమ్మకంతో ధ్యానం చేస్తే తప్పకుండా మెడిసిన్‌లో సీటు వస్తుందని చెప్పారు. వారు చెప్పిన ప్రకారమే ధ్యానం చేయడం ప్రారంభించాను.

 

అప్పుడే బెంగళూరు నుంచి సీనియర్ పిరమిడ్ మాస్టర్ "ధ్యానర్షి ప్రేమనాథ్" గారు చిత్తూరులోని "గౌతమబుద్ధా పిరమిడ్ కేర్ సెంటర్" కు రావడం జరిగింది. ప్రేమ్‌నాథ్ మాస్టర్‌కు నా లక్ష్యం గురించి వివరించగా వారు నన్ను రెండు గంటలు ధ్యానంలో కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చారు. ధ్యానంలో కూర్చున్నపుడు నేను తమిళనాడు రాష్ట్రంలో మెడిసిన్ పూర్తి చేసినట్లూ, ఆ రాష్ట్రంలోనే నర్సింగ్ హోమ్ పెట్టుకున్నట్లూ, రోగులను పరీక్షిస్తున్నట్లూ ఒక దృశ్యం కనపడింది.

 

41 రోజుల ధ్యానం ప్రారంభించిన కొద్ది రోజులకే ఎంసెట్ ఫలితాలు వచ్చాయి. అందులో నాకు 12,000 ర్యాంకు వచ్చింది. రెండు వేలు లోపు ర్యాంకు వచ్చిన వాళ్ళకు మాత్రమే మెడిసిన్‌లో సీటు వస్తుంది. కనుక నాకు ఎటువంటి పరిస్థితిలోనూ మెడిసిన్ సీటు రాదని ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది ఆఖరికి మా మా అమ్మ కూడా "నీకు మెడిసిన్‌లో సీటు రాదు; వేరే దేనికైనా ప్రయత్నం చేసుకో" అని చెప్పింది.

 

ఎవరు ఎన్ని చెప్పినా గోపాలకృష్ణమూర్తి సార్, రాధికా మేడమ్ వాళ్ళు "నిరుత్సాహపడకుండా రోజుకు అయిదు గంటల చొప్పున 41 రోజుల ధ్యానాన్ని పూర్తి చెయ్యి! నీకు ఎలాగైనా సీటు వస్తుంది" అని గట్టి నమ్మకంతో చెప్పారు. వారి సలహా మేరకు ఆ విధంగానే ధ్యానం చేయడం ప్రారంభించాను.

 

41 రోజులు పూర్తి కావడానికి ఒక వారం ముందు తమిళనాడు రాష్ట్రంలో MBBS చేయడానికి అవకాశం ఉందని తెలిసి వెంటనే అప్లికేషన్ పూర్తిచేసి పంపాను. సరిగ్గా 41వ రోజు తమిళనాడు రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో వున్నటువంటి "స్టాన్లీ మెడికల్ కళాశాల"లో నాకు MBBS సీటు లభించింది!

 

కలలో కూడా ఊహించని విధంగా నాకు సీటు రావడం అమిత ఆనందాన్నీ, ఆశ్చర్యాన్నీ కలుగచేసింది. ధ్యానం పట్ల సంకల్పశక్తి పైన పూర్తి నమ్మకం నాకు ఏర్పడింది. నా ప్రాణం వున్నంత వరకు నేను ధ్యానం, ధ్యానప్రచారం చేస్తాను!

 

ఇంతటి మహద్భాగ్యాన్ని అందరికీ అందజేస్తూ, ప్రపంచం నలుమూలలలో ధ్యాన ప్రచారం చేస్తున్న మన జగత్‌గురువు బ్రహ్మర్షి పత్రీజీకి శతకోటి పాదాభివందనాలు!

 

ఎన్నో లక్షలు ఖర్చుపెట్టి, ఎంతో సమయాన్ని ధ్యానం మరి ధ్యానప్రచారాలకు కేటాయిస్తూ నాలాంటి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తూన్న రాధికా, గోపాలకృష్ణమూర్తి దంపతులకు ఋణపడి వుంటాను.

 

ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ నా విన్నపం ఏమిటంటే .. గట్టి సంకల్పంతో దృఢ నిశ్చయంతో, పట్టుదలతో ధ్యానం చేస్తే సాధించలేనిది ఏదీ లేదు!

 

కనుక ప్రతి ఒక్కరూ ధ్యానం, ధ్యాన ప్రచారం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.

 

G.ప్రియదర్శిని

చిత్తూరు పట్టణం
90592 26999

 

Go to top