" ధ్యానశక్తితో ఉద్యోగ ప్రాప్తి "

 

 

నా పేరు "త్రివేణి". 2011లో నేను నా శరీరక అనారోగ్యం కారణంగా నేను ధ్యానంలోకి వచ్చాను. డెంగ్యూ జ్వరంతో హాస్పిటల్‌లో చేరిన నన్ను పరామర్శించడానికి వచ్చిన మా అత్త, పిన్ని గార్లు అక్కడే నాతో ధ్యానం చేయించారు. అంతకు ముందు కూడా చాలా సార్లు వాళ్ళు నాకు ధ్యానం గురించి చెప్పి ఉన్నారు కానీ నేనే వినలేదు.

 

అప్పటికి డాక్టర్లు రకరకాల మందులు ఇచ్చి, చికిత్సలు చేస్తున్నా నా ఆరోగ్యంలో ఏ అభివృద్ధి లేకపోగా రోజు రోజుకీ రక్తంలో ప్లేట్‌లెట్స్ కౌంట్ క్షీణించడంతో "ధ్యానమే శరణ్యం" అనుకుంటూ నేను వారు చెప్పినట్లు మంచంలో పడుకునే రెండు గంటలు పాటు ధ్యానం చేశాను.

 

ఆశ్చర్యకరంగా ఆ మర్నాటి నుంచే నా ప్లేట్‌లెట్స్ సంఖ్య పెరగడం మొదలయ్యింది! ఇక నేను పట్టు వదలకుండా ధ్యానం చేస్తూ అతి తక్కువ సమయంలోనే కోలుకుని ఇంటికి వచ్చేశాను!

 

మా పిన్ని నిర్వహింఛే 41 రోజుల ధ్యాన తరగతులలో పాల్గొని ఎన్నో అనుభవాలు పొందాను. అంతకు ముందు చిరు వ్యాపారులైన మా తల్లితండ్రులు ఎంతో కష్టపడి నన్ను చదివిస్తున్నా.. అనారోగ్యం కారణాలతో నా చదువు అంతంత మాత్రంగానే ఉండేది. దానికి తోడు నీరసం, కోపం మరి నలుగురిలో మాట్లాడలేని ఆత్మన్యూనతాభావం నాలో ఉండేవి.

 

ధ్యానంలోకి వచ్చాక అవన్నీ మటుమాయం అయిపోయాయి! ధ్యాన ప్రచారం చేస్తూ నా అనుభవాలనూ .. మరి నేను విన్న పత్రీజీ సందేశాలనూ .. నలుగురితో చెబుతూ నేను ఆత్మవిశ్వాసంతో మాట్లాడడం నేర్చుకున్నాను.

 

చక్కగా చదువుకుంటూ TTC పూర్తిచేసి ఉపాధ్యాయవృత్తికి ప్రవేశపరీక్షలు అయిన TET మరి DAC లలో మంచి ర్యాంకులు సాధించాను. కౌన్సిలింగ్ అయ్యేంత వరకు ఖాళీగా ఉండవద్దని టీచింగ్ వాలంటీయర్ ‌గా చేరి పాఠశలలోని పిల్లలకు ధ్యానం నేర్పించడం మొదలుపెట్టాను.

 

"ఇతరులకు మంచి చేస్తే ప్రకృతి మనకు మంచి చేస్తుంది" అన్న విశ్వనియామాన్ని నిజంచేస్తూ నాకు "ప్రభుత్వ ఉపాధ్యాయిని" గా ఉద్యోగం వచ్చింది.

 

ప్రస్తుతం నేను చుట్టూ కొండకోనలలో ప్రకృతి ఒడిలో అందంగా ఒదిగి ఉన్న "గిడ్డ బొమ్మనహళ్ళి" గ్రామంలో ఉద్యోగం చేసుకుంటూ ఖాళీ సమయాలలో చుట్టుప్రక్కల గ్రామాలలో ధ్యాన ప్రచారాన్ని నిర్వహిస్తున్నాను.

 

శాకాహార విశిష్ఠతను గురించి గ్రామస్థులకు తెలియజేస్తూ శాకాహార ర్యాలీలు నిర్వహిస్తున్నాను.

 

ఇంత గొప్ప కార్యక్రమాన్ని నాతో చేయిస్తున్న పత్రీజీ కి నా కృతజ్ఞతలు!

 

B.త్రివేణి

గిడ్డ బొమ్మనహళ్ళి
అనంతపూరం జిల్లా

72075 63679

Go to top