" శ్రీ వినాయకుడు మా ఆప్తమిత్రుడు "

 

 

నా పేరు " జ్యోతి ".

 

2006 డిసెంబరులో మండపేట "సుధ" మేడమ్ ద్వారా నాకు ఆనాపానసతి ధ్యానం పరిచయం అయ్యింది.

 

వెంటనే నేను శాకాహారిగా మారి జూలై 2007 సం||లో నా భార్త సత్యనారాయణ గారి ఉద్యోగం రీత్యా అమెరికా వచ్చాను. తరువాత మెల్లమెల్లగా ధ్యానం తగ్గించి మళ్ళీ మాంసాహారిగా మారాను.

 

డిసెంబర్ 2008 న మా మామయ్య గారి ఆరోగ్యం సరిగ్గా లేదని చెప్పడంతో నేను ఇండియా వెళ్ళాను. నేను వెళ్ళేలోపే వారికి నయం అయినా .. నాకు తిరిగి అమెరికా రావడానికి వీసా లేకపోవడంతో అక్కడే ఉండపోవలసి వచ్చింది. దాంతో నాలో ఆలోచన మొదలయ్యింది.

 

ఇలా నేను ఇండియా రావడానికీ .. మరి తిరిగి అమెరికాకు వెళ్ళే దారులు మూసుకుపోవడానికీ "కారణం" తెలుసుకోవడానికి మళ్ళీ ధ్యానం మొదలు పెట్టాను.

 

ఒకానొక రోజు ధ్యానంలో ఉండగా .. "ప్రతిరోజూ ధ్యానం చేస్తే వైకుంఠపాళిలో ఒక గడి ముందుకు .. పుస్తకపఠనం, సజ్జన సాంగత్యం చేస్తే చిన్న చిన్న నిచ్చెనలు .. పిరమిడ్ నిర్మాణానికి తోడ్పడితే పెద్ద నిచ్చెన ఎక్కి చివరికి పరమపదసోపాన స్థాయికి చేరుకుంటాం. మాంసాహారి అయితే పెద్ద పాము నోట్లో పడి అధఃపాతాళానికి జారిపోతాం" అని సందేశం వచ్చింది.

 

"మాంసాహారిగా నేను మారినందువల్లే పెద్దపాము నోటిలో చిక్కి నా కథ మళ్ళీ మొదలుకు వచ్చింది" అని అర్థమై .. ధ్యానిగా, పూర్తి శాకాహారిగా మారి మళ్ళీ అమెరికా వీసా సంపాందించి మినియాపోలిస్ లో స్థిరపడడం జరిగింది.

 

అప్పటినుంచి అమెరికాలో ప్రతిరోజూ ధ్యానం, ధ్యాన ప్రచారం చేస్తూ .. పత్రీజీ కాన్సెప్ట్‌ లు వింటూ .. సజ్జన సాంగత్యం చేసుకుంటూ .. "రహస్యం", "మ్యాజిక్" పుస్తకాలు చదివి ప్రయోగాలు చేస్తూ కొద్దొ రోజులలోనే అమెరికాలో స్థిరనివాసం ఉండగల "గ్రీన్‌కార్డు" ను కూడా పొందగలిగాను!

 

ఈ క్రమంలో ఒకానొక రోజు మేము మా స్నేహితులు కలిసి మినియాపోలీస్‌ లో ఇళ్ళు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాం. నాకు పెయింటింగ్ హాబీ అవ్వడం వల్ల నా ఫ్రెండ్ "శిల్ప" నన్ను వినాయకుడి పెయింటింగ్ వెయ్యమని కోరింది.

 

నేను వినాయకుడిని ఒక మాస్టర్ గా భావించి ధ్యానం చేసి "నీ పెయింటింగ్ తో మా ఇళ్ళుకట్టడం ప్రారంభిస్తున్నాం; ఎవ్వరికీ ఏ ఆటంకం కలగకుండా చూడు" అని ప్రార్థించి పెయింటింగ్ మొదలు పెట్టాను.

 

ఇంతలో నాకు కావలసిన లేత, ముదురు నీలం రంగులు అయిపోవడంతో ముందే ఆటంకం కలిగిందని బాధ పడ్డాను. అంతలో వెంటనే పక్కనే రెండు కొత్త రంగులు ప్రత్యక్షమై కనిపించాయి! నాకు ఆశ్చర్యం వేసింది .. గబగబా ఆ రంగులు తీసుకుని పెయింటింగ్ మొదలు పెట్టాను.

 

చివరగా ‘నామం’ పెట్టడానికి ఎరుపురంగు చూస్తే ఖాళీసీసా కనిపించింది. "వినాయకా! ఎరుపురంగు కావాలి!" అని అడిగాను. ఇంతలో కొత్త ఎరుపురంగు ప్రత్యక్షమై కనిపించింది! ఎంతో ఆనందంతో ఆ పెయింటింగ్ పూర్తి చేసాను!

 

తరువాత కొద్ది రోజులకు అనుకోని కారణాల వల్ల ఇళ్ళు ఆలస్యం అవ్వటంతో వినాయకుడిని మళ్ళీ "ఈ పెయింటింగ్ వేసింది ఇళ్ళకు ఏ ఆటంకం కలగకుండా ఉండాలని కదా! నేను నా ఇంటిలో Roof Top పిరమిడ్ నిర్మించుకుంటున్నాను, మరి ఎందుకు ఆగింది? పిరమిడ్ లోకకళ్యాణానికే అయితే నాకు పిరమిడ్ ఇళ్ళు కావాలి! " అని అడిగాను.

 

మర్నాడు ఉదయం 8 గంటలకే మాకు ఇళ్ళు పూర్తిచేసి ఇస్తున్నామని " mail" వచ్చింది. ప్రస్తుతం మా ఇంటిలో 7'X7' పిరమిడ్ నిర్మాణం జరుగుతోంది.

 

U.S.A కి ఏ పిరమిడ్ మాస్టర్ వచ్చినా మా ఇంటికి తప్పక రావాలని కోరుకుంటున్నాను.


ఇంతటి అద్భుతాలు ధ్యానం ద్వారా మాత్రమే కలుగుతాయని చెప్పిన బ్రహ్మర్షి పత్రీజీ కి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా సరిపోదు.


మీ అందరికీ మా అమెరికా వినాయకుని తరపున శుభాకాంక్షలు!

 

జ్యోతి వైట్ల - U.S.A

Go to top