" సంకల్ప ధ్యానం ద్వారా శిశువు జననం "

 

 

నా పేరు "రజని".


నేను చిత్తూరు పట్టణం M.R.O., Officeలో V.R.A గాపని చేస్తున్నాను.

 

నాకు 20.2.1013 న చిత్తూరు పట్టణం ఈనాడు ఆఫీసులో పనిచేస్తున్న "జ్యోతీశ్వర్" గారితో వివాహం అయ్యింది. వివాహమై 2 1/2 సం||లు గడిచినప్పటికీ మాకు సంతాన భాగ్యం కలగలేదు. సంకల్పశక్తితో పూర్తి నమ్మకంతో ధ్యానం చేస్తే సంతానం కలుగుతుందని మా సన్నిహితులు చెప్పగా స్థానిక గాంధీరోడ్డులోని "గౌతమ బుద్ధా పిరమిడ్ హెల్త్‌కేర్ ధ్యానం సెంటర్" కు వెళ్ళడం జరిగింది.

 

"గోపాల కృష్ణమూర్తి " సా ధ్యానం గురించి దాని యొక్క విశిష్టతను వివరించగా వారి శ్రీమతి "రాధిక మేడమ్" గారు సంతానం కోసం మాతో సంకల్పం చెప్పి ధ్యానంలో కూర్చోబెట్టారు.

 

సంకల్పం చెప్పడానికి ముందే వారు "మాంసాహారాన్ని శాశ్వతంగా మానివేస్తాము " అని మాతో ప్రతిజ్ఞ చేయించారు. అప్పటి నుంచి ప్రతిరోజూ క్రమం తప్పకుండా రోజుకు రెండుసార్లు మా వారితో కలసి మెడిటేషన్ సెంటర్‌కు వచ్చి పూర్తి నమ్మకంతో ధ్యానం చేసే వాళ్ళం.

 

ధ్యానం ప్రారంభించిన కొద్దిరోజులకే నాకు గర్భం వచ్చింది. మా వారు ధ్యానంలో కూర్చుని "మాకు ఎలాంటి బిడ్డ పుడతాడు?" అని ప్రశ్నించుకున్నప్పుడు మెడిటేషన్ సెంటర్‌లో వరుసక్రమంలో ఏర్పాటు చేసిన ఫోటోలలో ఐదవ ఫోటోలో వున్న వ్యక్తి జన్మిస్తారని అంతరంగం నుంచి సమాధానం వచ్చింది!

 

ధ్యానం నుంచి లేచిన తరువాత ఐదవ ఫోటోలో ఎవరున్నారని చూస్తే " పతంజలి మహర్షి " ఫోటో కనిపించింది. తిరిగి ధ్యానం లో కూర్చున్నప్పుడు పతంజలి మహర్షి కనిపించి "నేనే నీ గర్భాన జన్మిస్తాను" అని చెప్పడం మాకు చాలా సంతోషాన్ని కలిగించింది!

 

నా ప్రసవానికి కొద్దిరోజుల ముందు మావారు పడుకుని వున్నప్పుడు ఒక ఆవు తన కొమ్ములను నా పొట్టకు ఆనించి దగ్గరకు వస్తున్నట్లూ .. మా వారు ఆ ఆవును వెనుకకు తోస్తూన్నట్లూ .. ఒక దృశ్యం కనిపించి .. ఆ ఆవు మా వారితో "మీ శ్రీమతికి ఆపరేషన్ ద్వారా బిడ్డ జననం జరుగుతుంది; కానీ భయపడాల్సిన పనిలేదు" అని చెప్పిందట.

 

ఆ ప్రకారమే నేను 10.6.2016 న ఆపరేషన్ ద్వారా మగ శిశువుకు జన్మనివ్వడం జరిగింది. ఆ శిశువుకు "మహర్షి" అని నామకరణం చేశాము.

 

15.8.2016 న బ్రహ్మర్షి పత్రీజీ చిత్తూరు పట్టణం "గౌతమ బుద్ధా పిరమిడ్ హెల్త్ కేర్ సెంటర్ " కు వచ్చినప్పుడు మేమిరువురం బాబుతో కలసి గురువు గారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. "ఇంతటి మహాభాగ్యాన్ని కల్పించిన జగద్గురువు బ్రహ్మర్షి పత్రీజీ" కి శతకోటి వందనాలు.

 

ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ మా విన్నపం ఏమంటే పూర్తి శాకాహారులుగా మారి నమ్మకంతో దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరూ ధ్యానం, ధ్యానం ప్రచారంచేస్తే అనుకున్నవి అన్నీ పొంది ఆనందమయ జీవితాన్ని జీవించగలుగుతాము.

 

రజనీ జ్యోతీశ్వర్

తోటపాళ్యం

చిత్తూరు పట్టణం
9618817750

Go to top