శ్రీ అన్నపూర్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రం "

 

 

నా పేరు " రమణరాజు ".

 

నేను 2009, సెప్టెంబర్ 20 వ తేదీన పిరమిడ్ ధ్యాన, మార్గంలోకి వచ్చాను.

 

గతంలో నేను "సత్యాసాయిబాబా" గారి సంస్థలో చురుకుగా పాలుపంచుకుంటూ ఎంతో భక్తితో స్తోత్రపారాయణలు చేశాను. ఆ సమయంలోనే గాజువాక పిరమిడ్ మాస్టర్ "శ్రీమతి వీరజగదీశ్వరి" గారి ద్వారా ఆనాపానసతి ధ్యానాన్ని నేర్చుకుని ఎన్నో అనుభవాలనూ మరి జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలనూ నేనే పరిష్కరించు కోగల సామర్థ్యాన్ని పొందాను.

 

అహింసా - ధ్యాన మార్గంలో నడుస్తూ .. నేను పొందిన ఆనందాన్ని ఇతరులకు అందజేయాలని పెదగంట్యాడ "ఉడా కాలనీ" లో ఉన్న మా రెండుఇళ్ళపై "శ్రీ అన్నపూర్ణ పిరమిడ్ ధ్యానకేంద్రం"మరి "శ్రీ సత్యనారాయణ పిరమిడ్ ధ్యానకేంద్రం" అనే రెండు రూఫ్‌టాప్ పిరమిడ్ లను నిర్మించి యోగాభ్యాసకులకూ, సీనియర్ సిటిజన్స్‌కూ ధ్యాన ప్రచారం చేస్తున్నాను.

 

ప్రతి పౌర్ణమికీ, అమావాస్యకీ ఇక్కడ సీనియర్ పిరమిడ్ మాస్టర్లతో ఆత్మజ్ఞాన శిక్షణా శిబిరాలను నిర్వహించడం జరుగుతోంది.

 

* నేను ప్రతి ధ్యానమహాచక్రం లో పాల్గొంటూ పత్రీజీ వేణునాద ధ్యానంలో లీనమై ఎందరో మాస్టర్ల సజ్జన సాంగత్యంలో ఎంతో జ్ఞానాన్నీ, ఆనందాన్నీ పొందుతున్నాను.

 

* ప్రతి సంవత్సరం బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో జరుగుతూన్న బుద్ధ పౌర్ణమి కార్యక్రమాలలో పాల్గొని ఆ మెగా పిరమిడ్‌లో ధ్యానం చేసి ఎంతో బుద్ధత్వాన్ని పొందుతున్నాను.

 

* గురుపౌర్ణమికి "సదానందయోగి" గారి ఆశ్రమంలో జరిగే కార్యక్రమంలో కూడా పాలు పంచుకుంటున్నాను.

 

* "పిరమిడ్ టూర్స్" లో భాగంగా ఎన్నో ప్రదేశాలకు, మానససరోవరం, పత్రీజీగారితో ఈజిప్ట్ పిరమిడ్, హిమాలయాలు మరి భూటాన్, శ్రీలంక .. ఇలా ఎన్నో యాత్రలలో ఎంతోమంది యోగులను కలిసి ఆనందంగా జీవిస్తున్నాను. ఇంతటి ఆనందాన్నీ మరి సత్యజ్ఞాన మార్గాన్నీ అందించిన పత్రీజీకి నా కృతజ్ఞతలు.

 

S.V.రమణరాజు

గాజువాక

విశాఖపట్టణం
ఫోన్: 9848644299

Go to top