" ఆస్ట్రల్ మాస్టర్స్ క్రిస్టల్ ఇచ్చారు "

 

నా పేరు "సిద్ధులు".

 

B.S.N.L లో డివిజన్ ఇంజనీర్‌గా నేను రిటైర్ అయ్యాను. 18-4-2012 నుంచి ధ్యానం చేస్తున్నాను.

 

ధ్యానంలోకి రాక ముందు నుంచే దైవానుభవాలు నాకు ఎన్నో ఉన్నాయి. ఏసు ప్రభువు, వెంకటేశ్వర స్వామి, పుట్టపర్తి సాయిబాబా, శిరిడీ సాయిబాబాలతో నాకు కలిగిన అనుభవాలు ఎన్నో! ఎన్నెన్నో!

 

ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి నా దగ్గర ఉన్నంత వరకు ఐదు పైసలు కానీ పదిపైసలు కానీ పావలా కానీ అక్కడ చందా వేసేవాడిని.

 

ఒకానొక ఆదివారం నా దగ్గర ఆ డబ్బులు కూడా లేకపోవడంతో ప్రభువుకు శరణాగతుడనై "ఈ రోజు నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు; నీకు చందా వెయ్యలేను; నన్ను క్షమించు" అని హృదయపూర్వకంగా ప్రార్థించుకున్నాను.

 

ప్రార్థన ముగించి కళ్ళు తెరచి చూస్తే .. నా ముందర పావలాలు, అర్థ రూపాయలు, రూపాయలు పిడికెడు డబ్బులు కుప్పగా ఉన్నాయి!

 

నా సంతోషానికి అవధులు లేవు! దేవునికి కృతజ్ఞతలు తెలుపుకొని ఆ డబ్బంతా ఆ రోజు చందావేశాను. అంతకు ముందు ఎక్కువ అంటే పావలా వేసి వుంటానేమో! ఆరోజు నా ప్రార్థన విని ప్రభువు అంత డబ్బు ఇవ్వడం అద్భుతం కాక మరేమిటి?

 

ధ్యానంలోకి వచ్చాక నక్షత్ర మండలాలలో విహరించడం, పత్రీజీ కనపడటం ఎక్కువగా జరిగేది!

 

ఈ క్రమంలో ఒకసారి నాకు గుండెలో తీవ్రంగా నొప్పి వచ్చింది. "ధ్యానం చేస్తే అదే పోతుంది" అనుకుని డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళకుండా నొప్పిని భరిస్తూ ధ్యానం లో కూర్చున్నాను.

 

కాస్సేపటికి ఒక ఆస్ట్రల్ మాస్టర్ ఒక రూపాయి సైజు బ్రౌన్ కలర్ మందమైన కార్డ్‌బోర్డ్ పేపర్ బిళ్ళను నొప్పి వచ్చేచోట బొటన వ్రేలితో కాస్సేపు అదిమి పట్టుకున్నాడు. అంతే! నొప్పి తగ్గిపోయింది!

 

మా "శ్రీ శివ పిరమిడ్ " పిరమిడ్ నిర్మాణ సమయంలో ఒక అద్భుత సంఘటన జరిగంది.

 

డిజైనర్ గారి పర్యవేక్షణలో 3-9-2015 న పిరమిడ్ కొలతలు వగైరా చేసి కొలతలు చెదిరిపోకుండా పెయింట్ చేస్తూంటే పిరమిడ్ కట్టే స్థలంలో ఉంగరంలో అమర్చే సైజులో ఒక గ్రీన్ కలర్ క్రిస్టల్ దొరికింది! అది అక్కడ ఎవ్వరూ పోగొట్టుకునే అవకాశం లేదు. పాతది కూడా కాదు కొత్తది. విచిత్రంగా ఉందని భావించి కళ్ళకు అద్దుకుని పిరమిడ్‌ లో అమర్చాము.

 

ఇప్పుడు ఆ పిరమిడ్ లో ఎంతో మంది ధ్యానం చేస్తూ ఆనంద ఆరోగ్యాలు పొందుతున్నారు. దీనికంతటికీ మూలమైన పత్రీజీకి శతకోటి వందనాలు సమర్పించుకున్నాను.

 

గుదిటి సిద్దులు

నీరుగట్టువారిపల్లె

మదనపల్లి
9490181868

Go to top