" నమ్మిన సిద్ధాంతాలకు గౌరవం "

 

 

హైదరాబాద్‌కు చెందిన పిరమిడ్ మాస్టర్ "శ్రీ అట్లూరి మధుసూదన రావు" గారు కృష్ణాజిల్లా .. కైకలూరు తాలుకా పులపర్రు గ్రామంలో జన్మించారు. వ్యవసాయ ఆధారిత కుటుంబం నుంచి వచ్చిన వీరు కష్టపడి చదివి "ఛార్టర్డ్ అకౌంటెంట్" గా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.

 

PSSM మాసపత్రిక "ధ్యానాంధ్రప్రదేశ్" కు పబ్లిషర్ గా చాలా సంవత్సరాల పాటు సేవలను అందించిన తమ చిన్న కూతురు "రమాదేవి" గారి ద్వారా ధ్యానం నేర్చుకుని .. దీర్ఘకాలంగా తమను వేధిస్తోన్న అనారోగ్య సమస్యల నుంచి ఒకింత ఉపశమనం పొందారు.

 

ఇక వెంటనే తమ స్వగృహంలో కూడా ధ్యాన శిక్షణా తరగతులను నిర్వహిస్తూ ‘తమ శేషజీవితాన్నంతా కైలాసపురి అభివృద్ధికీ మరి PSSM లో జరిగే బృహత్ కార్యక్రమాల నిర్వహణకూ అంకితం చేశారు.

 

"తెలంగాణ ధ్యానసచివాలయం" ఆంధ్రప్రదేశ్ "ధ్యాన సచివాలయం" పుస్తకాల ప్రచురణతో పాటు మరెన్నో చక్కటి కార్యక్రమాలకు చేదోడు-వాదోడుగా నిలిచి .. "పత్రీజీ చేపడుతూన్న ఈ మహాయజ్ఞాలలో నా జన్మను ధన్యం చేసుకుంటున్నాను" .. అని వినయంగా తెలియజేసే ఈ గొప్ప మాస్టర్ .. 2016, సెప్టెంబర్ 7వ తేదీన దేహవిరమణ చేసి .. ఉన్నతలోకాలకు తరలివెళ్ళారు.

 

వారి కోరిక ప్రకారం కుటుంబ సభ్యులు వారి పార్థివ దేహాన్ని విద్యార్థుల పరిశోధనల నిమిత్తం ఉస్మానియా వైద్య కళాశాలకు అప్పగించడం జరిగింది.

 

తదుపరి కర్మకాండలను నిర్వహించరాదని వారు తమ కుటుంబ సభ్యులను కోరడం .. మరి వారు కూడా తమ కుటుంబ పెద్ద నమ్మిన సిద్ధాంతాలనూ మరి ఆశయాలనూ గౌరవించడం విశేషం!

 

PSSM 18 ఆదర్శసూత్రాలకు నిలువెత్తు నిదర్శనంలా నిలిచిన గ్రేట్ గ్రాండ్ పిరమిడ్ మాస్టర్ శ్రీ అట్లూరి మధుసూదన రావు గారికి సమస్త పిరమిడ్ కుటుంబం ధ్యానాంజలి సమర్పించుకుంటోంది!!

 

 

శ్రీ అట్లూరి మధుసూదన రావు
హైదరాబాద్

Go to top