" శాకాహార ప్రచారం పిరమిడ్ ధ్యానమే నా ఊపిరి "

 

 

నా పేరు " భవాని ". నేను ఒకానొక గృహిణిని. 10 సం||ల క్రితం నేను నా భర్త ద్వారా "ధ్యానం" లోకి వచ్చాను.

 

మేము ధ్యానం లోకి రాకముందు మా పిల్లలు "మాంసాహారం తినం" అని మారాం చేసినా తిట్టి కొట్టి బలం వస్తుందని చెప్పి వారిచే బలవంతంగా మాంసం తినిపించేదానిని. అది ఇప్పుడు గుర్తుకు వస్తే నాకు సిగ్గుగా మరి బాధగా ఉంటుంది. ఇప్పుడు మాది పూర్తిగా "శాకాహార ధ్యాన కుటుంబం".

 

ముఖ్యంగా తల్లులకు నా విజ్ఞప్తి ఏమిటంటే .. చిన్న పిల్లలను బుజ్జగించి బ్రతిమాలి శాకాహారం తినిపించి వారిచే ధ్యానం చేయించండి! అప్పుడే వాళ్ళు బలవంతులుగా, శక్తివంతులుగా, జ్ఞానవంతులుగా అత్మాభివృద్ధి చెందుతారు.

 

మేము ధ్యానంలోకి వచ్చిన తరువాత మాంసాహారులు అయిన మా అమ్మ, మా చెల్లెలు, మా ఆడపడుచులు మరి మా మిత్రుల కుటుంబాలు, కూడా పూర్తి "శాకాహార ధ్యాన కుటుంబాలు" గా మారిపోయాయి.

 

తటవర్తి వీరరాఘవరావు గారు పిరమిడ్, శాకాహారం మరి ధ్యానం గురించి చెబుతూ "చాలా మంది ధ్యానం చెయ్యడం ‘ఆరోగ్యం బాగుపడటానికి’ అనుకుంటారు. కానీ అలా అనుకోవడం చిన్న చీమ మీద ఫిరంగి గుండు ప్రయోగించడం లాంటిది. ధ్యానం ఆత్మజ్ఞాన భాండాగారం" అని వివరించి.

 

"పత్రీజీని తక్కువగా అంచనా వెయ్యవద్దు; పత్రీజీ బోధనలు మరి వారు సూచించిన సూచనలు పాటించి వారి మార్గంలో పయనించండి" అని చెప్పి నా ఆత్మోన్నతికి ఎంతగానో దోహదం చేశారు. వారికి కృతజ్జతలు.

 

వీరవాసరం లో K.V.Dప్రసాద్ గారు కూడా "వీరవాసరం పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ" ఆధ్వర్యంలో సజ్జనసాంగత్యాలు, శాకాహార ర్యాలీలు నిర్వహించి ఎన్నో పిరమిడ్‌లను నిర్మింపచేస్తూ మా ఇంటిపై కూడా "సదానంద యోగి పిరమిడ్ ధ్యాన కేంద్రం" నిర్మాణానికి సహకరించారు.

 

మా అబ్బాయి "వీరేంద్ర సరోవర్" మా అమ్మాయి "సురేఖ" చర్టర్డ్ ఎకౌంటెంట్ మా కోడలు "దివ్య" C.M.A కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెంట్ గా ఉన్నత స్థానాలలో రాణిస్తున్నారంటే "అది ధ్యాన మహిమే" అని మేము గట్టిగా పూర్తిగా విశ్వసిస్తున్నాము.

 

ఇంకో విషయం చెప్పాలి .. "మా పూర్తి శాకాహార ధ్యాన కుటుంబం లోకి వచ్చినవారు మాతో పాటు శాకాహారం తిని ధ్యానం చేస్తారా? అని నేను ఎప్పుడూ ఆలోచించేదాన్ని. కానీ మిరాకిల్ గా మా అబ్బాయి "వీరేంద్ర సరోవర్" ని ప్రేమించి పెళ్ళి చేసుకున్న "దివ్య" పెళ్ళి తరువాత పూర్తి శాకాహారి గా మారి ధ్యానం చేస్తోంది. అందుకు మా కుటుంబం అంతా బ్రహ్మానందంతో ఉన్నాము.

 

ఇలాంటి దివ్య మోక్షమార్గాన్ని చూపించిన జగద్గురువు పత్రీజీ గారికి శతకోటి ప్రణామాలు!

 

మీసాల భవాని

వీరవాసరం

ప.గో. జిల్లా
9701921235

Go to top