" మరణ భయం పోయింది "

 

 

హాయ్ ఫ్రెండ్స్ ! నా పేరు "Sally"

 

ధ్యాన- శాకాహారశక్తితో నేను ప్రాణాంతకమైన "బ్రెయిన్ ట్యూమర్" జబ్బు నుంచి హాయిగా ఎలా బయటపడగలిగానో మీకు తెలియజేస్తాను.

 

"యోగా టీచర్" గా ఏ చీకూ చింత లేని జీవితాన్ని గడుపుతూన్న నాకు ఆరు సంవత్సరాల క్రితం నా మెదడులో ఒక కణితి ఏర్పడిందని డాక్టర్లు నిర్ధారించారు. మరణ భయంతో నేను మెరుగైన చికిత్స కోసం ప్రపంచంలోని బెస్ట్ డాక్టర్లను సంప్రదించాను. వాళ్ళు రకరకాల పరీక్షలు చేసి "పుర్రెను తెరిచి ఆపరేషన్ ద్వారా గడ్డను తొలగించి .. రేడియేషన్ చెయ్యాలి" అని తేల్చి చెప్పారు!

 

అయితే ఏ ఒక్కరూ కూడా "నువ్వు ఏం తింటున్నావు? నీ జీవనశైలి ఏంటి? నీ ఆలోచనా విధానం ఏంటి?" అని మాత్రం అడిగిన పాపాన పోలేదు. ఆపరేషన్ చేసినా "అలాంటి కణితి మళ్ళీ రాదు" అన్న గ్యారెంటీ కూడా ఇవ్వలేదు.

 

దాంతో నేను ఈ జబ్బుమూలాల నుంచి నాకు నేనుగానే శాశ్వతంగా బయటపడాలని తీవ్రంగా ఆలోచించి మొట్టమొదటగా చిన్నప్పటి నుంచీ ఇతర జీవులను చంపితింటూన్న మాంసాహారాన్ని పూర్తిగా మానివేసి .. శుద్ధ శాకాహారిగా మారిపోయాను.

 

నేను బ్రతకడానికి .. నాలాంటి జీవులను చంపితినడం ఎంత తప్పో తెలుసుకున్నాక .. నాలో భయం ఆందోళన మరి మరణభయాలు క్రమక్రమంగా తగ్గు ముఖం పట్టసాగాయి. క్రమంగా "వేగన్" గా కూడా మారిపోయి .. ప్రశాంత మనస్సుతో ఉంటూ సృష్టిలోని ప్రతి ఒక్క ప్రాణిలో నన్నే చూసుకొవడం మొదలు పెట్టాను.

 

అలా నా భౌతిక మానసిక శరీరాలను ప్రక్షాళనం చేసుకున్న తరువాత ఒకానొక యోగా తరగతిలో కైరో పిరమిడ్ మాస్టర్స్ రమేష్, మధుల గార్ల ద్వారా ధ్యానం గురించి తెలుసుకున్నాను.

 

ప్రాపంచిక జీవితంలో నా పేరు, నా ఊరు, నా కుటుంబం, నా బ్యాంక్ బ్యాలెన్స్, సమాజంలో నా స్థానం, నా ఆస్తిపాస్తుల గురించి నాకు ఎంత స్పష్టంగా తెలుసో .. అంత స్పష్టంగానే నేను ధ్యానం ద్వారా నా ఆత్మ మూలాలను గురించి కూడా తెలుసుకున్నాను.

 

"నేను ఎవరు?/ ఎప్పటి నుంచి ఈ ప్రయాణాలు చేస్తున్నాను? ఇలా ఎన్ని జన్మలు గడిపాను? ఈ జన్మ ఎందుకు తీసుకున్నాను?" అన్నవి తేటతెల్లం అయ్యాక ఇక నా ఆనందానికి అవధులు లేకుండా పోయింది!

 

ఇలా నా ఆత్మ యొక్క శాశ్వత తత్త్వం నాకు అర్థం కాగానే .. మెల్లిమెల్లిగా నా మెదడు లోని కణితి దానికదే కరిగిపోవడం మొదలయ్యింది. నాలో ఉన్న జబ్బుతో కూడా నేను ప్రేమపూర్వకంగా స్నేహం చెయ్యడం వల్ల నాలో దాని పట్ల ఉన్న భయం మటుమాయం అయిపోయింది !

 

ఇప్పుడు నేను హాయిగా ప్రశాంతంగా మరి ఆరోగ్యంగా జీవిస్తూ .. "యోగా టీచర్" గా నేను తెలుసుకున్న ధ్యాన-శాకాహార సత్యాలను అందరికీ తెలియచేస్తూ "శాకాహార జగత్" సాధనకై కృషి చేస్తున్నాను.

 

Sally Ibrahim

కైరో - ఈజిప్ట్
0020 - 1061425610

Go to top