"వ్యాపారంతో పాటే .. ధ్యాన ప్రచారం"

 

 

నా పేరు "శేషగిరిరావు"


నా వయస్సు 64 సంవత్సరాలు. గత 45 సంవత్సరాలుగా నేను ఏలూరు పట్టణం లో "వాసవీ సిల్క్స్" పేరు తో వస్త్రవ్యాపారం చేస్తున్నాను.

 

2009 సంవత్సరంలో ఒకసారి నా భార్య "శ్యామల" తీవ్ర డిప్రెషన్ బారిన పడి అనారోగ్యం పాలుఅయ్యింది. డాక్టర్ల చుట్టూ తిరిగి రకరకాల చికిత్సలు చేయించినా లాభం లేకపోవడంతో ‘ధ్యానం’ ఒక్కటే దానికి పరిష్కారం మార్గం అని తెలుసుకున్నాం. అయితే అప్పటి వరకూ మాకు ధ్యానం గురించి కానీ .. ‘శ్వాస మీద ధ్యాస’ పదం గురించి గానీ తెలియదు.

 

అప్పుడే .. ఏలూరు లో తటవర్తి వీర రాఘవరావు దంపతుల మూడు రోజుల ధ్యాన తరగతులు ఏర్పాటు చేయబడ్డాయని తెలిసి అక్కడికి వెళ్ళి ‘ధ్యానం’ చేసుకున్నాము.

 

ఆ మూడు రోజుల ‘ధ్యానం’ లో ఎంతో ఆనందాన్ని అనుభవించాము మరి ఎంతో ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నాం. నా భార్య కూడా, చాలా బాగా స్వస్థత పొందడం జరిగింది. ఇక వారం రోజులలోనే మా ఇంటి 9'x9' పిరమిడ్ ను నిర్మించి అందులో ‘ధ్యానం’ చేసుకోవడం మొదలుపెట్టాం.

 

గత 7 సంవత్సరాలుగా మా షాపులో ప్రతి మంగళవారం రాత్రి 9.00 గం||నుంచి 10.00 గం||ల వరకు మా సిబ్బంది 80 మందితో క్రమం తప్పకుండా ‘ధ్యానం’ చేయిస్తూ వారందరిలో కూడా చక్కటి మార్పును మేము చూడగలిగాం.

 

మా ఇంటి దగ్గర కూడా ప్రతి నెల రెండవ అదివారం సీనియర్ పిరమిడ్ మాస్టర్లచే వన్ డే వర్క్స్‌షాప్స్ నిర్వహిస్తున్నాం. మా షాపుకు వచ్చే ప్రతి కస్టమర్‌కి బట్టల కవర్‌తో పాటు ధ్యానం - శాకాహార పాంప్లెట్ ఇస్తూ వ్యాపారం తో పాటు ధ్యాన ప్రచారం కూడా చేస్తున్నాం.

 

ప్రతి నెల 50 "ధ్యాన జగత్" మాస పత్రికల ను మరి 500 శాకాహార పుస్తకాలను షాపుకు వచ్చే క్రొత్త వారికి అందజేస్తున్నాం.

 

"జూన్ 21, యోగా డే" సందర్భంగా ఉదయం 6.30 గం||ల నుంచి 650 మందితో అయిదు కిలో మీటర్లు "శాంతి ర్యాలీ" నిర్వహించాం. ర్యాలీ అనంతరం స్థానిక "శ్రీ కన్వెన్షన్ A/Cకళ్యాణ మండపం" లో చక్కటి ఆత్మజ్ఞాన శిక్షణా శిబిరం ఏర్పాటు చేశాం.

 

అక్టోబర్ 2వ తేదీ గాంధీజయంతి ని పురస్కరించుకుని ఏలూరు పట్టణం లో 350 మందితో పది కిలోమీటర్లు శాకాహార ర్యాలీ నిర్వహించాం!

 

మా ధ్యానకుటుంబానికి ఇంతటి ఆనందాన్ని పంచుతూన్న పత్రీజీకి శతకోటి ధ్యాన వందనాలు!

 

మాజేటి శేషగిరిరావు

ఏలూరు - ప||గో||జిల్లా
92905 73947

Go to top