GCSS 9- పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ - బెంగళూరు

 

జర్మనీ
"షోలా బిర్‌గెట్ స్టార్స్"

 

జర్మనీ దేశానికి చెందిన కళల శిక్షకురాలు "షోలా బిర్‌గెట్ స్టార్స్" .. ఇటలీ దేశంలోని రోమ్ నగరంలో "Holistic seminar Centre for self healing techniques" అనే సంస్థను స్థాపించారు. "అంతరావబోధ, బేషరతుప్రేమ, ఎరుకతో కూడిన శ్వాసలతో మిళితమై వ్యక్తులందరూ స్వీయ విశ్వాసంతో జీవించాలి అని అకాంక్షించే "షోలా" గారితో ..

 

ప్రశ్న: "మీ జీవిత విశేషాలు తెలియచేస్తారా?"


షోలా : నేను రచయిత్రిని. శిల్పాలు చేస్తాను, స్వీయస్వస్థతా విధానాలను బోధిస్తాను. చిత్రకళ, పెయింటింగ్, గ్రాఫిక్స్, ఫోటోగ్రఫీలపై సెమినార్లు, మరి వర్క్షాప్లు నిర్వహిస్తాను.

 

ఇక నా జీవిత నేపధ్యానికి వస్తే .. నేను రెండవ ప్రపంచ యుద్ధం అంతంలో జర్మనీలో జన్మించాను. ఆ యుద్ధాన్నీ, దాని పర్యవసానాలనూ చూసి దానిలో బాధలకు గురి అయిన వారి దుస్థితికి కదిలిపోయాను.

 

"నాకు కూడా అలానే జరుగుతుందేమో .. అలా జరగకుండా ఏం చెయ్యాలి?" అనుకునేదానిని. నా శరీరంలోని ప్రతి అణువూ భయంతో నిండిపోయి, భయపడాటాన్ని నిరోధించలేక పోయేదాన్ని. ఆ భయంతో ఒంటరిగా కూర్చుని "ఆకాశం దాటి వెళ్ళాలి" అనుకుంటూ అప్రయత్నంగా "ధ్యానం" నేర్చుకున్నాను.

 

పది సంవత్సరాల వయస్సులో మేం శరణార్థులుగా ‘డెన్మార్క్’ కు వలసవెళ్ళినప్పుడు మేం జర్మనీ నుంచి వచ్చాం కనుక అక్కడి వాళ్ళంతా మమ్మల్ని ద్రోహులుగా చూసేవాళ్ళు.


ఆ అనుభవాలతో పెద్దయిన నేను "నాలాగా ఇక ఏ పిల్ల/పిల్లవాడూ భాధకు గురి కాకూడదు" అని నాలాంటి వాళ్ళకు స్వీయ విశ్వాసం, ఏదైనా అపాయం ఎదురైనా సరే ప్రయోగం చెయ్యగలగటం, ఎదుటివాళ్ళకు తమపై తీర్పులను ప్రదర్శించే అవకాశం ఇవ్వకపోవటం వంటి స్వీయ నిర్ణయాలు తీసుకోవడంలో శిక్షణను ఇచ్చేదానిని.

 

అందుకుగాను నేను రంగులనూ, సంగీతాన్నీ ఊహలనూ, నిర్దేశక ధ్యానాన్నీ ఉపయోగిస్తాను. పిల్లల హృదయాలలోకి .. పిల్లల వంటి హృదయాలు ఉన్న వారిలోకి .. చొచ్చుకుపోయే ప్రయత్నం చేస్తున్నాను!

 

ప్రశ్న : "మీ ఆధ్యాత్మిక అనుభవాలు?"


షోలా : నేను జీవిత అనుభవాన్నీ మరి ఆధ్యాత్మిక అనుభవాన్ని వేరు వేరుగా చూడను కనుక నా దృష్టిలో రెండూ ఒక్కటే!

 

ప్రశ్న : GCSS ఎలా వుంది?


షోలా: చాలా ఆనందంగా, సంతృప్తిగా వుంది! అనేక సంవత్సరాల పాటు తిరస్కారానికి గురై పడి లేచిన కెరటంలా ఉన్న నేను .. "జీవితాన్ని అవగాహన చేసుకుని, జ్ఞానం పొంది ఇవి అన్నీ నేర్చుకున్నాను మరి చేస్తున్నాను! కానీ వీటిని స్వీకరించేవారు ఎవరు?" అని అక్రోశించేదానిని.


అందుకు సమాధానంగా ఈ ఆహ్వానం ద్వార నేను సరియైన చోట, సరియైన వ్యక్తులకు అది అందివ్వటం నాకు చాలా ఆనందాన్నిస్తోంది.

 

ప్రశ్న: "దీని ప్రభావం మానవ చైతన్యం పై ఏవిధంగా వుంటుంది?"


షోలా: నా కేంద్రీకరణ చైతన్య శిక్షణ .. శరీరంపట్ల, ఆరోగ్యంపట్ల, మనస్సు మరి ప్రకృతి వనరుల పట్ల మన చైతన్య స్థాయిని పెంపొందిస్తాము.
మనష్యులు తమతమ శరీరాలను ప్రేమించక పోవటం అంటే సత్యం గురించి భయపడటం! సత్యానికి చేరువకాలేని వారు ఆధ్యాత్మికులు కాలేరు కనుక మనం మన శరీరాన్ని, మన అంతర్ శిశివునూ, నేర్పరితనం లేకుండా ప్రేమించాలి.

 

ప్రశ్న: "మానవజాతి భవిష్యత్ గురించి మీ అవగాహన!"


షోలా: మానవజాతిలో బాహ్యంగా ఎన్ని వైపరీత్యాలు కనిపిస్తున్నప్పటికీ .. "సత్యాన్ని చేరుకుని దానిలో జీవించాలి" అనుకునే వారు .. "సత్యానికి కట్టుబడి వుండే వారు" ఆ యా దేశాలలో అసంఖ్యాకంగా వున్నారు!


కొందరిలో కలిగిన ఈ జ్ఞానం మిగిలినవారితో వేగవంతం చేయబడుతుంది. అలా వేగవంతం చేసే వారిలో పత్రిజీ ముఖ్యులు! వారి ద్వారా ఇక్కడకు వచ్చిన వారు ఈ జ్ఞానాన్ని తమ తమ ప్రాంతాలలో తప్పక విస్తరిస్తారు!

 

Go to top