బోస్నియా - హెర్జెగోవినా


" Dr. Semir Sam Osmanagich "

 

 

అంతర్జాతీయ వక్త .. "అర్కియలాజికల్ పార్క్ బోస్నియన్ పిరమిడ్ ఆఫ్ ది సన్" ల నిర్దేశకులు .. "రష్యన్ అకాడెమీ ఆఫ్ నేచురల్ సైన్సెస్" మాస్కో సభ్యుడు.. మరి పిరమిడ్‌ల గురించి విస్తృతంగా పరిశోధన చేసి 15 పుస్తకాలు రచించిన డాక్టర్ శామ్‌‌తో ...

 

ప్రశ్న: "సర్ మీ గురించీ మీ కార్యక్రమాల గురించీ వివరిస్తారా!?"


డాక్టర్ శామ్: నేను "History of Civilization" లో Ph.D చేసి .. గత 30 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిరమిడ్‌లను గురించి పరిశోధనలు చేస్తున్నాను.

 

2005 లో బోస్నియా పిరమిడ్‌లను కనుగొని "బోస్నియా పిరమిడ్ ప్రాజెక్ట్" ను నిర్వహిస్తున్నాను. అది ప్రపంచవ్యాప్తంగా అత్యంత చేతనత్వం కలిగిన ఆర్కియలాజికల్ త్రవ్వకంగా మారింది..

 

ప్రతి సంవత్సరం వందలాది మంది స్వచ్ఛందంగా వచ్చి బోస్నియాలోని చరిత్రపూర్వపు సొరంగాలను తవ్వుతూ ఉంటారు.

 

ప్రశ్న: "పిరమిడ్‌లపై ఆసక్తి మీకు ఎందుకు కలిగింది?"


డాక్టర్ శామ్: పిరమిడ్‌లు స్వచ్ఛమైన, ఖర్చులేని శక్తిని ఇస్తాయి. అవి ఆహారపు నాణ్యతనూ, నీటి అణునిర్మాణాన్నీ మెరుగుపరచి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అగ్మిపర్వతం ప్రేలుళ్ళు మరి భూకంపాల ప్రభావాన్ని తగ్గించటంతో పాటు మన ఆధ్యాత్మిక శక్తులను పెంపొందిస్తాయి.

 

"పూర్వీకులు మనకోసం వదిలివెళ్ళిన ఈ పిరమిడ్ జ్ఞానాన్ని మళ్ళీ మనం ఇప్పుడు తెలుసుకోవలసిన అవశ్యకత ఎంతగానో వుంది" అని చిన్నతనం నుంచే నేను మెక్సికో, ఈజిప్ట్, పెరూ, బొలీవియా. రష్యా, గ్వాటిమాలా, ఎల్ సాల్వడార్, స్పెయిన్, ఇటలీ మరికొన్ని దేశాలలోని పిరమిడ్‌లను సందర్శించాను.

 

ఆ క్రమంలోనే నేను 2005 లో బోస్నియాలోని చిన్న పట్టణం "విస్సోకా" లో మట్టి పొరలతో కప్పబడివున్న కొండను గమనించాను. కంపాస్ తీసుకుని దాని నాలుగు త్రిభుజాకార ప్రక్కతలాలను ఖచ్చితమైన మూలలతో గుర్తించి చూడగా .. అవి తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర దిశలకు ఖచ్చితంగా అమరి .. మధ్య బిందువు వద్ద కలుపబడి వున్నాయి. అది మట్టిపొరలతో నిర్మించబడి వున్న కృతిమనిర్మాణం అని నాకు వెంటనే తెలిసింది!

 

ప్రశ్న: "అప్పుడు ఏం చేశారు?"


డా||శ్యామ్: వెంటనే ఆర్కియలాజికల్ త్రవ్వకం కోసం ఒక లాభాపేక్షలేని సంస్థను స్థాపించి త్రవ్వకాలు సాగించగా మట్టి క్రింద పెద్ద దీర్ఘచతురస్రాకారం పలకలు కనుగొన్నాము, అవి కాంక్రీట్‌తో తయారు చేయబడ్డాయి మరి అక్కడ ఐదు పిరమిడ్‌లు ఉన్నాయి అని మేము తెలుసుకున్నాము.

 

వాటికి "సూర్యుడు", "చంద్రుడు", "భూమి", "డ్రాగన్", "ప్రేమ" అని పేర్లు పెట్టి వాటి సముదాయాన్ని "బోస్నియన్ వ్యాలీ ఆఫ్ పిరమిడ్స్"గా పిలవసాగాము. ఇంకా త్రవ్వకాలు కొనసాగించగా "బోస్నియన్ వ్యాలీ ఆఫ్ పిరమిడ్స్" క్రింద చరిత్ర పూర్వకాలానికి చెందిన భూగర్భ సొరంగాల నెట్‌వర్క్, ఛాంబర్స్, ఇంటర్ సెక్షన్స్ ఇంకా పొరలు కనుగొన్నాము.

 

"శక్తిశాస్త్రం" నిపుణులైన భౌతికవేత్తలు, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, సౌండ్ ఇంజనీర్ల సహాయంతో మేము "సన్ పిరమిడ్" కొనపైన ఎనర్జీ బీమ్ అల్ట్రాసౌండ్‌తో నమోదు చేయగా అది 28KHZ వుంది.

 

"ఆ పౌనఃపున్యం దగ్గర నెగెటివ్ అయానులు Negativeions ఎక్కువగా కేంద్రీకరించబడి అవి మానవ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి" అని ఆ సొరంగాలు, పిరమిడ్‌లు సందర్శించిన వారి నుంచి మేము ఎన్నో స్వస్థతా నిర్థారణలు పొందాము.

 

ప్రశ్న: "పిరమిడ్‌లు, సొరంగాల వల్ల ప్రయోజనాలు ఏమిటి?"


డా||శ్యామ్: సొరంగంలో వుండటం "ఆరా" ను వృద్ధి చేస్తుంది! టెలిపతీ, ఆరా చూడటం, దివ్యదృష్టి వంటి ఆధ్యాత్మిక/ఇంద్రియాలు పెంపొందటానికి ఇది ఆధారం.

బోస్నియా పిరమిడ్‌లు ధ్యానానికి అత్యంత అనువైన ప్రదేశాలు. వాటిలో పూర్తి నిశ్శబ్దం, సెల్‌ఫోన్ సంకేతాలు లేకపోవటం, ఇంటర్‌నెట్, సాంకేతిక రేడియోధార్మికత, హానికారక విశ్వరేడియోధార్మికత క్రిందనున్న నీటి ప్రవాహం నుంచి వ్యతిరేక శక్తి ప్రవాహాలు లేకపోవటం అన్నీ ఎంతో ఉపయుక్తమైనవి.

 

ప్రశ్న : "పిరమిడ్ వ్యాలీ పట్ల మీ స్పందన?!"


డా||శ్యామ్: పిరమిడ్ వ్యాలీ నన్నెంతో ఆకర్షించింది! దాని నిర్మాణశైలి, క్రిస్టల్స్, సేక్రెడ్ జామెట్రీకి చెందిన అంశాలు సరిగ్గా అమరివున్నాయి. చుట్టూ చక్కటి ప్రకృతి, చిన్న నిర్మాణాలు, మధ్యలో సరస్సుతో ఇది మనోహరమైన శక్తిక్షేత్రం, దానికి తోడు వందలాది మందికి ఉచిత భోజనం .. ఇది ప్రపంచాన్ని మార్పు చెందిస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు.

 

ప్రశ్న: "పత్రీజీ గురించి?"


డా||శ్యామ్: ఇదంతా ఒక వ్యక్తి ఆలోచనతో మొదలైంది. దానికి ఎంతోమంది సహకరించారు. "కేంద్రీకృతమైన సంకల్పంతో ఏదైనా సాధ్యమే" అన్నదానికి ఇది ప్రత్యక్ష నిదర్శనం.

Go to top