అమెరికా
" జ్యూడీ సటోరి "

 

 

అమెరికా దేశానికి చెందిన "జ్యూడీ సటోరీ" గారు మానవజాతి మూలాలను గురించి తన ఊర్ద్వాత్మ ద్వారా తాము అందుకున్న సందేశాలతో "Sun Shine Before the Dawn" గ్రంధాన్ని అందించారు. "DNA" ను డీకోడ్ చేసి జన్యురచనను మార్పు చేసుకోవడం గురించి " కాంతి భాష " లో మాట్లాడే జ్యూడీ గారితో ..

 

ప్రశ్న: "మీరు ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి స్ఫూర్తి?"


జ్యూడీ: నిజానికి నేను గత అనేక జన్మల నుంచే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాను ఈ జన్మలో ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తూనే .. "శక్తిశాస్త్రం" లో మూడు సంవత్సరాల డిప్లామో చేసిన తరువాత నా స్వీయ ఆధ్యాత్మిక మార్గదర్శనం ద్వారా మళ్ళీ ఈ మార్గంలోకి వచ్చాను.

 

ప్రశ్న: "మీ ప్రణాళిక?"


జ్యూడీ: ఈ భూమి మీద నూతన దివ్యజీవన ఆరంభానికి జన్మ తీసుకున్న నేను నా యొక్క "కాంతి భాష" ద్వారా మనుషులను "DNA"మార్పును సిద్ధం చేస్తాను. సుదీర్ఘకాలంగా నేను ఆధ్యాత్మిక బోధకులతో, అసెండెడ్ మాస్టర్లతో, దేవదూతలతో మరి నక్షత్ర మిత్రులతో కలిసి నేను జీవించడం వల్ల నాకు ఈ అద్భుత అవకాశం లభించింది.

 

ప్రస్తుతం భూమిపై ఒక గొప్ప నూతనయుగం ఆరంభం అయ్యింది! భూమి కూడా మూడవతలం నుంచి ఐదవతలం లోకి ప్రవేశించడం వల్ల ఆ ఉన్నత తలం యొక్క పౌనఃపున్యంతో అది ప్రకంపిస్తోంది! దీనివల్ల మానవుల ప్రకంపనా స్థాయి కూడా మార్పుచెంది వారిలో ఇంతవరకూ నిగూఢంగా ఉన్న సామర్థ్యాలన్నీ కూడా సచేతనం చేయబడతాయి.

 

ఇందుకు గాను వారికి సహాయం చెయ్యడానికి వివిధ నక్షత్ర మండలాల సభ్యులు సంసిద్ధులుగా ఉన్నారు! మనుషులంతా కూడా ధ్యానం చేసి తమ మనస్సు చేసే గందరగోళాల నుంచి బయటపడి .. ఆత్మ మూలంలోంచి వెలువడుతూన్న తమ అంతర్ స్వరాన్ని వినడం మొదలుపెట్టాలి.

 

అలా వినడం మొదలుపెట్టిన క్షణం నుంచే వారు తమ అంతరంగంలో ఉన్న దివ్యకాంతితో అనుసంధానించబడి .. కణాలలోని ఉల్లాసకర ప్రకంపనలను అనుభూతి చెందుతారు.

 

ప్రశ్న: "దీని వల్ల లాభాలేంటి?"


జ్యూడీ: ఇలా తమ ఆత్మచైతన్యపు సామర్థ్యాలను సచేతనం చెందించుకున్న వాళ్ళంతా కూడా ప్రేమ, ఐక్యత, పరస్పర సహకారాలతో కూడి జీవితం పట్ల నూతన అవగాహనతో జీవిస్తూ ఉంటారు. ఇదంతా కూడా "కాంతి జీవన విధివిధానం" మరి దివ్య ప్రణాళికలో భాగంగా ఇప్పుడు ఇది తప్పనిసరి అయ్యింది!

 

ప్రశ్న: "పిరమిడ్ వ్యాలీ ఎలా ఉంది?"


జ్యూడీ: "పిరమిడ్" అన్నది గొంగళీపురుగును సీతాకోకచిలుకలా రూపాంతీకరణం చెందించే అద్భుతమైన కట్టడం! ఇక్కడికి రావడం .. నా స్వంత ఇంటికి వచ్చినట్లు ఉంది!

 

ఇక "పత్రీజీ" విషయానికి వస్తే .. ప్రాపంచికంగా మరి ఆధ్యాత్మికంగా నేను కలుసుకున్న నాయకులలో వారు ఎంతో అద్భుతమైనవారు! వారిని నేను ఇంతకు ముందే అనేక జన్మలలో కలిశాను. మానవ జాతి పురోగమనంలో తోడ్పడడానికి ఆత్మల సమూహాలుగా వచ్చిన మనం అంతాకూడా దివ్యప్రణాళిక అమలులో మనవంతు పాత్రలను పోషించాలి!

 

ప్రతిక్షణం ధ్యానస్థితిలోనే ఉంటూ ప్రేమమూర్తులుగా, కరుణామూర్తులుగా వర్తమానంలో జీవించండి!

 

Go to top