K.రోశయ్య సందేశం

 

 

రాష్ట్ర పరిపాలనా వ్యవస్థకు గుండెకాయ వంటి సచివాలయంలో పని చేస్తూన్న ఉద్యోగులు ... మామూలుగానే ఎంతో పని ఒత్తిడితో ఉంటారు. ఆఫీసు, ఇళ్ళు, పిల్లలు ఇలా అన్ని రకాల బాధ్యతలనూ సక్రమంగా నిర్వర్తించాలంటే మానసిక సమతుల్యత చాలా అవసరం. అప్పుడే వారంతా శారీరకంగా, మానసికంగా మరి ఆత్మపరంగా కూడా చక్కటి ఆరోగ్యంతో జీవిస్తారు. ఇలాంటి ఆరోగ్యవంతమైన జీవన విధానం "ధ్యానం" తో అలవడతుంది. "ధ్యానం" చేయడం ద్వారా ఆరోగ్యవంతంగా జీవించడమే కాకుండా, స్నేహపూరితమైన, ప్రేమపూరితమైన భావాలతో ఆనందమయమైన జీవితం సాగిస్తారు.

 

ఇంతటి చక్కటి "శ్వాస మీద ధ్యాస" ధ్యానాన్ని సచివాలయంలో ఉద్యోగులు ఆచరిస్తూ, వారి వారి సమస్యలను పరిష్కరించుకుంటూ "ధ్యానం" ద్వారా వారి జీవితాలలో వెలుగులు నింపుకుంటున్నారు. ఆధ్యాత్మికతతో కూడిన చక్కటి జీవనం సాగిస్తున్నారు. ధ్యానం ద్వారా వీరందరూ పొందిన అనుభవాలనూ, ఆధ్యాత్మిక అభివృధ్ధినీ పుస్తక రూపంలోకి తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది.

 

"అహింసా జగత్ -2020" లక్ష్యంగా చేసుకొని, అహర్నిశలు కృషిచేస్తూ, శాకాహార ర్యాలీలను నిర్వహిస్తూ, మాంసాహారులను సైతం శాకాహారులుగా మారుస్తూ, శాకాహార ప్రాముఖ్యతనూ, ధ్యానం యొక్క ప్రాముఖ్యతనూ, పిరమిడ్ శక్తినీ, పిరమిడ్ యొక్క ఉపయోగాలనూ ప్రపంచానికంతటికీ చాటి చెప్తున్న పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‍మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రీజీకీ, మరి పిరమిడ్ మాస్టర్స్‌కూ మరి ప్రత్యేకంగా సచివాలయం పిరమిడ్ మాస్టర్స్ అందరికీ అభినందనలు తెలుపుతూ ....

 

K.రోశయ్య
తమిళనాడు గవర్నర్

 

Go to top