బ్రహ్మర్షి పత్రీజీ సందేశం

 

 

"నిద్ర" అన్నది ప్రకృతి మనకు ఇచ్చిన మహా వరం! నిద్రలో ప్రాణులన్నీ సేదతీరుతాయి. క్రొత్తశక్తిని పుంజుకుంటాయి. అయితే "ధ్యానం" అన్నది మనకు మనం ఇచ్చుకునే అత్యంత మహా గొప్ప వరం.. "ధ్యానం" అంటే "శ్వాస మీద ధ్యాస"!

 

"ధ్యానం" అంటే హాయిగా కూర్చుని, కళ్ళు రెండూ మూసుకుని, సహజంగా, సరళంగా జరుగుతూన్న శ్వాస ధార మీద మనస్సును ఏకీకృతం చేయడం. అప్పుడు మనస్సు నిశ్చలమైపోయి. విశేషంగా శూన్యమైపోయి, నిశ్చల స్థితిలో వుంటుంది. "ధ్యానం నిర్విషయం మనః" అన్నారు; "యోగః శ్చిత్తవృత్తి నిరోధః" అన్నారు.

 

ఆ విధంగా ధ్యానయోగులమైనప్పుడు విశేషమైన విశ్వమయప్రాణశక్తి అవాహనం అయి తద్వారా నాడీమండలశుద్ధి జరుగుతుంది. తద్వారా శారీరకరోగాలన్నీ భస్మమవుతాయి. మరి ఎవరి రోగాలను వారే సృష్టించుకున్నారు కనుక... వారి వారి రోగాలను వారే భస్మం చేసుకోవాలి.

 

"ధ్యానయోగం" ద్వారా మనం సకల రోగాల నుంచి విముక్తిని పొందుతాం: మరి ఆరోగ్యమయ, ఆనందమయ, సంతోషమయ జీవితాలను సంపాదించుకుంటాం.

 

ఆరోగ్యమే మహాభాగ్యం!
తెలంగాణ సచివాలయ ధ్యాన అభ్యాసకులందరికీ అభినందనలు!!
తెలంగాణ సచివాలయ ధ్యానయోగులందరికీ ప్రణామాలు!!!

 

 

బ్రహ్మర్షి పత్రీజీ
వ్యవస్థాపకులు, పిరమిడ్ స్పిరిచ్యువల్ మూవ్‍మెంట్

Go to top