డా|| న్యూటన్ కొండవీటి సందేశం

 

 

అంతర పరివర్తనం చెందటానికి ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ ధ్యానం యొక్క అవశ్యకత ఎంతగానో ఉంది. మేము ఇరవై సంవత్సరాలకుపైగా ధ్యానం చేస్తూండటం వల్ల మా వ్యక్తిగత జీవితాలలో ఎన్నో మార్పులు అనుభవంలోకి వచ్చాయి. అలాగే వేలాది మంది ధ్యానుల జీవితాలలో ఎన్నో ప్రయోజనాలు పొంది, లోతైన స్వస్థత పొందటాన్ని మేము గమనించాము. ధ్యానం ద్వారా మన శరీరం, మనస్సు మరి భావావేశాలలో స్వస్థత చేకురుతుందని వైద్యులుగా మేము పూర్తిగా విశ్వసిస్తాం; ఒక ధ్యాని పొందే అత్యున్నత ప్రయోజనం ఏమిటంటే ‘ఎరుక’, ‘ఆత్మ సాక్షాత్కారం’.

 

" నేను ఎవరు ? "


" నా జీవిత ధ్యేయం ఏమిటి ? " అన్న ఈ రెండు ప్రశ్నలు, ప్రతి ఒక్కరి మనస్సులో ఉదయిస్తాయి. వీటికి సమాధానాలు ధ్యానంలోనే పొందుతాము. ధ్యానం మన జీవితంలో స్పష్టతను తీసుకువస్తుంది, అలాగే మనల్ని చైతన్య వంతులుగా చేస్తుంది. సరియైన పౌరులుగా మనం ఈ ప్రపంచంలో శాంతిని తీసుకురావాలంటే, మొట్టమొదట అది మనతోనే ఆరంభమవ్వాలి. దైనందిన జీవితంలో ధ్యానం మానసిక ప్రావీణ్యతను తీసుకువస్తుంది. అలాగే నిరంతర సాధన ద్వారా జ్ఞానోదయం పొందుతాము. ప్రతి వ్యక్తికీ మనం ధ్యానం నేర్పిస్తే ఈ ప్రపంచంలో దారిద్ర్యం, బాధలు అంతమవుతాయి.

 

సరళమైన పిరమిడ్ ధ్యానాన్ని నేర్పించి లక్షలాది మందిని ధ్యాన సాధకులుగా మార్చిన, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‍మెంట్ వ్యవస్థాపకులైన.. బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీకి మా హృదయపూర్వక కృతజ్ఞతలు..

 

మనందరమూ ధ్యాన మార్గంలో నడుస్తూ, ఈ భూమండలాన్ని సస్యశ్యామలం చేద్దాం...

 

ప్రేమతో
డా|| న్యూటన్ కొండవీటి, M.B.B.S., M.D
డా|| లక్ష్మీ M.B.B.S.

Go to top