కడియం శ్రీహరిసందేశం
తెలంగాణ సచివాలయం ఉద్యోగులు భోజన విరామ సమయంలో ధ్యానం చేస్తూ చక్కటి ఆరోగ్యాన్ని పొందటం చాలా గొప్ప విషయం. వారి వారి విధులను చక్కగా నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తున్నాను. ధ్యానం ద్వారా పొందిన ఫలితాలను పుస్తక రూపంలో ప్రచురించడం అన్నది అందరికీ ఎంతో స్పూర్తిదాయకం.
ఇంతటి మహత్తరమైన, సులువైన, "శ్వాస మీద ధ్యాస" ధ్యానాన్ని పైసా ఖర్చు లేకుండా ఉచితంగా సచివాలయంలోని ఉద్యోగులకు తెలియజేసి... వారిచేత చేయిస్తూ ప్రాపంచికంగా.. ఆధ్యాత్మికంగా వారి సమగ్ర అభీవృద్ధికి కృషి చేస్తున్న మహానీయులు ... పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రీజీకి.. పిరమిడ్ మాస్టర్స్‌కు మరి ప్రత్యేకంగా సచివాలయం మాస్టర్స్ అందరికీ అభినందనలు తెలుపుతూ ....
కడియం శ్రీహరి