నాయిని నర్సింహారెడ్డిసందేశం

 

 

రాష్ట్ర పరిపాలనా వ్యవస్థకు సచివాలయం గుండెకాయ వంటిది. ఆఫీసు, ఇల్లు పిల్లలు ఇలా.. అనేకమైన బాధ్యాతలతో సచివాలయ ఉద్యోగులు ఎన్నో ఒత్తిళ్ళనూ, సమస్యలనూ ఎదుర్కొంటూ మానసికంగా, శరీరకంగా.. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.

 

ఇటువంటి తరుణంలో సచివాలయ ఉద్యోగులు భోజన విరామ సమయంలో ధ్యానం చేస్తూ .. పరిపూర్ణ ఆరోగ్యాన్ని పొంది చక్కగా విధులను నిర్వహిస్తూండటం చాలా ముదావహం సచివాలయ ఉద్యోగుల ధ్యానానుభవాలే అందుకు నిదర్శనం. వీరందరి అనుభవాలు చక్కగా పుస్తకరూపంలో తీసుకురావడం అన్నది అందరికీ స్పూర్తిదాయకం

 

ఇటువంటి గొప్ప ధ్యానాన్ని పైసా ఖర్చు లేకుండా ఉచితంగా సచివాలయంలోని ఉద్యోగులకు తెలియజేసి.. వారిచేత ధ్యానం చేయిస్తూ .. ప్రాపంచికంగా .. ఆధ్యాత్మికంగా .. వారి సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్న మహనీయులు .. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రీజీకీ .. పిరమిడ్ మాస్టర్స్‌కూ మరి ప్రత్యేకంగా సచివాలయం పిరమిడ్ మాస్టర్స్ అందరికీ అభినందనలు ..

 

నాయిని నర్సింహారెడ్డి

Go to top