కె.తారక రామారావుసందేశం

 

 

ప్రస్తుతం ఉన్న గ్లోబలైజేషన్ మరి ఐ.టి. విప్లవం ప్రపంచాభివృద్ధికి ఎంతగానో దోహదపడింది. అదే విధంగా ఒక వ్యక్తి తన యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి కూడా ఎంతగానో ఉపయోగపడ్డాయి. ప్రస్తుత పరిస్థితులలో ప్రతి మనిషికి అత్యవసరమైనది శారీరక, మానసిక ఆరోగ్యం. ధ్యానం వల్ల పరిపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని ఎంతో మంది గొప్ప శాస్త్రవేత్తలు తెలియజేసారు.

 

ఇటువంటి ధ్యానాన్ని మన తెలంగాణా సచివాలయంలో ఉద్యోగులందరూ నేర్చుకొని, ప్రతిరోజూ ధ్యానం చేస్తూ, వారి అనుభవాలను పుస్తక రూపంలో "ధ్యాన తెలంగాణ సచివాలయం" తీసుకురావడం ఎంతో గొప్ప విషయం. ఈ పుస్తకం అందరికీ స్పూర్తినిస్తుందని ఆశిస్తున్నాను.
అభినందనలతో...

 


కె.తారక రామారావు

Go to top