" ఎంతో ఆనందంగా జీవిస్తున్నాను "

 

 

పేరు : S. సుమలత
హోదా: డిప్యూటీ సెక్రెటరీ
విభాగం: ఉన్నత విద్య

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

నా స్నేహితులు పిరమిడ్ మెడిటేషన్ చేస్తూ నన్నూ చేయమని చెప్పారు. ధ్యానం ప్రారంభించాక అంతులేని దుఃఖాన్ని, భయాన్ని జయించాను .. అసంతృప్తి, విపరీతమైనన కోపం తగ్గాయి.

 

"శ్వాస మీద ధ్యాస" అంటే "మన మనోఫలకంపై వుండే వికారాలన్నింటినీ తుడిచి వేయడం" అని అర్థమైంది. చిత్తభ్రమణ తొలగి, అద్భుతమైన దృశ్యాలు గోచరించి ఆనందాన్ని కలిగించాయి. నా శ్వాసే నా గురువై .. ప్రతి క్షణం నన్ను గైడ్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

 

నా కూతురిని నేను యోగినిలా చూడగలుగుతున్నాను. ఇంతకు ముందు అల్లకల్లోలంగా వుండే ప్రపంచం .. ఇప్పుడు నాకు సుందరంగా, ఒక నాటక రంగంలా గోచరిస్తున్నది. నా జీవితం, నా పనిలో నైపుణ్యం పెరిగి .. ఎన్నో రెట్లు పనిని అవలీలగా చేయగలుగుతున్నాను.

 

ప్రతిరోజు తప్పనిసరిగా గంట సేపు ధ్యానం చేస్తాను. పత్రీజీ రచించిన ఆధ్యాత్మిక పుస్తకాలన్నింటినీ నేను చదివాను. వాటితోపాటుగా పరమహంస యోగానంద, రమణ మహర్షి, భగవాన్ రజనీష్, సేత్ మాస్టర్, రామ్తా మాస్టర్, లోబ్‌సాంగ్ రాంపా ఇలా ఎందరో మాస్టర్స్ పుస్తకాలను చదివాను.

 

నా జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ నా అంతరంగంలో మాత్రం ఎప్పుడూ ఆనందంగా వుంటాను. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎన్నో గొప్ప అనుభవాలు కలుగుతూ ఉంటాయి. ప్రతి అనుభవం ఎంతో జ్ఞానాన్ని నేర్పిస్తుంది. ధ్యానం చేయటం ద్వారా నాలో ఉన్న భయాలన్నీ పోయాయి. అనేక థర్డ్ ఐ అనుభవాలు కలిగాయి.

 

ధ్యానానికి ముందు నాలో ఎంతో అలజడి ఉండేది. ధ్యాన సాధన తరువాత చాలా హాయిగా ఏకాగ్రతతో ఎన్ని పనులైన చేయగలుతున్నాను.

 

ధ్యానమహాచక్రంలో అఖండ ధ్యానంలో ఆర్గనైజర్‌గా పనిచేసినప్పుడు రాళ్ళతో సైతం కమ్యూనికేషన్ చేయగలిగాను. ఎన్నో గొప్ప గొప్ప అనుభవాలు కలిగాయి. అఖండ ధ్యానంలో ఎంతో గొప్ప సేవ చాశాను. పత్రీ సార్ యావత్ ప్రపంచానికి ఇచ్చిన గొప్ప వరం ధ్యానమహాచక్రం.

 

ప్రతి సంవత్సరం యావత్ ప్రపంచంలోని ప్రతి ధ్యాని ధ్యానమహాచక్రం పండుగ కోసం సంవత్సరం అంతా వేచిచూస్తూ వుంటారు. ధ్యానమహాచక్రంలో పాల్గొన్న వారందరికీ ఆసన సిద్ధి, స్థిత ప్రజ్ఞత తప్పక కలుగుతాయి. ధ్యానమహాచక్రంలో పత్రీజీ ఆధ్వర్యంలో ధ్యానం అద్భుతం. గురువు సమక్షంలో చేసే ధ్యానం అద్భుత ఫలితాలను ఇస్తుంది. ఒక్కసారైన గురువు ముఖతః ధ్యానం చేస్తే మనం ఉన్నతంగా ఎదుగుతాం.

 

నాలాగే ఈ ప్రపంచంలోని మానవులంతా ఏకమై "శ్వాస మీద ధ్యాస" ధ్యానాభ్యాసం చేసి సత్ఫలితాలు, ఆనందమయ జీవితం పొందాలని ఆశిస్తున్నాను.

 

సందేశం: సెక్రెటేరియట్‌లో మేమంతా చేసే గ్రూప్ మెడిటేషన్ ఎంతో శక్తివంతంగా ఉంటుంది. పని ఒత్తిడి, టెన్షన్‍తో జీవించే మేము.. ప్రతిరోజూ భోజన విరామ సమయంలో ధ్యానం చేస్తూ మా జీవితాలలో క్రొత్త వెలుగులు నింపుకుంటున్నాం. కనుక మనమందరం ధ్యానం చేద్దాం ప్రపంచమంతా ధ్యాన వెలుగులు నింపుదాం.

 

 

Go to top