" ధ్యానం మనల్ని ఉంచుతుంది-కూల్‌గా "

 

 

పేరు : B.V. ధావంత్
హోదా : అకౌంటెంట్
విభాగం : కో-ఆపరేటివ్ సొసైటీ


పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

మా సెక్షన్‌‍లో వారం రోజులపాటు శ్రీమతి సూర్యప్రభ మరి శ్రీమతి లీలా మేడమ్ గార్లు ధ్యానం క్లాసులు నిర్వహించారు. ఆ విధంగా నాకు ధ్యాన పరిచయం అయ్యింది. అంతకు ముందు నేను మోకాళ్ళ నొప్పులతో బాధ పడేవాడిని, B.P. మాత్రలు రోజూ వాడేవాణ్ణి. కోపం, చిరాకు ఉండేవి. ఆఫీసులో పని ఒత్తిడి వలన ఇంటికెళ్ళాక కూడా అలజడిగా ఉండేది. ఇంట్లో ఏ పనీ చెయ్యాలనిపించేదికాదు. ఇంట్లో అందరిపైనా చిరాకు పడేవాడిని.

 

కానీ ధ్యానం మొదలుపెట్టాక నా B.P., కంట్రోల్‌‍లోకి వచ్చింది. మోకాళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గిపోయాయి. మైండ్ ఎప్పుడూ కూల్‌గా ప్రశాంతంగా ఉంటోంది. ఇప్పుడు ఇంట్లో కూడా ఎవరిపైనా అరవడం గాని, కోపగించుకోవడంగాని చేయడం లేదు. ఆఫీసులో పనిని కూడా చాలా బాగా చేస్తున్నాను. మనస్సు ఎప్పుడూ ఆనందంగా ఉంటోంది.

సందేశం: మనమందరం ధ్యానం చేద్దాం .. ధ్యానశక్తిని చాటుదాం.

 

Go to top