" మాకుటుంబమంతా ధ్యానమయం "

 

 

పేరు : S. యాదమ్మ
హోదా : అటెండర్
విభాగం : రెవెన్యూ

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

గత ఆరు నెలలుగా నేను ధ్యానం చేస్తున్నాను. సరళా మేడమ్ ద్వారా ధ్యానం నేర్చుకున్నాను. B.P., షుగర్ మరి గుండె జబ్బుతో నేను బాధపడుతూ ఉండేదాన్ని. ధ్యానం చేసిన తర్వాత మాత్రలు వేసుకోకపోయినా కూడా శరీరం తేలికగా, హాయిగా ఉంటోంది. ప్రతిరోజూ రెండు గంటలు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తున్నాను.

 

ధ్యానంలో నాకు బంగారు కాంతిపుంజం కనిపించింది. ఒకరోజు ధ్యానంలో పాము కనిపించింది. ధ్యానానికి ముందు ఆరోగ్యం సరిగ్గా లేక ఆఫీసులో పని కష్టంగా ఉండేది. ధ్యానం తర్వాత ఆఫీసు పని చాలా తేలికగా ఇష్టంతో చేస్తున్నాను. మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ధ్యానం చేస్తున్నారు.

 

సందేశం: "ధ్యానం సర్వ రోగ నివారిణి".. "ధ్యానం సర్వ భోగ కారిణీ" మనమందరం చేద్దాం. రోగాలను వదలి భోగాలతో, యోగులుగా జీవిద్దాం.

 

Go to top