" ఏ ట్యాబ్లెట్ అవసరం లేదు "

 


పేరు : P. ప్రసన్న
హోదా : సెక్షన్ ఆఫీసర్
విభాగం : సివిల్ సప్లైస్


పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

నేను ధ్యానం మొదలుపెట్టి రెండు నెలలు అవుతోంది. మొదట్లో పది నుండి పదిహేను రోజుల వరకు "ధ్యానం ఎప్పుడెప్పుడు అయిపోతుందా!" అనిపించేది. ఒకరోజు నాకు మధ్యాహ్నం ఆఫీసులో తల నొప్పి మొదలయ్యింది, సాయంకాలం వరకు కూడా తగ్గలేదు. అయితే ఇంటికి వెళ్ళేటప్పుడు బస్సులో మెడిటేషన్ చేస్తూ కూర్చున్నాను. పది నిమిషాల తర్వాత కళ్ళు తెరిచే సరికి నా తలనొప్పి పూర్తిగా తగ్గిపోయి తల అంతా రిలాక్స్ అయిపోయింది. చాలా ఆశ్చర్యమనిపించింది. అప్పుడే "ధ్యానంలో ఏదో మహత్యం ఉంది" అని నాకు అనిపించింది. అప్పటి నుండి టైమ్ కుదుర్చుకుని ధ్యానం కొనసాగించాను.

 

గత రెండు సంవత్సరాలుగా నేను కూల్ మరి డస్ట్ ఎలర్జీతో బాధపడుతున్నాను. దీనివలన సిటిజన్ టాబ్లెట్ బాగా వాడేదాన్ని. మెడిటేషన్ వల్ల నేను కూల్ మరి డస్ట్ ఎలర్జీ పూర్తిగా తగ్గిపోయింది, గత రెండు నెలలుగా టాబ్లెట్స్ మానేసాను. ఇప్పుడు క్రమం తప్పకుండా రోజూ కొద్దిసేపైనా ధ్యానం చేస్తున్నాను. నిత్యం ధ్యానం చేసేలా నన్ను ప్రోత్సహించిన సూర్యప్రభ మేడమ్‌కు మరి లీలా మేడమ్‌కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

 

సందేశం: ధ్యానం చేద్దాం.. ఎటువంటి అనారోగ్యాల పాలవ్వకుండా, ఎ టాబ్లెట్స్ అవసరం లేకుండా ఆరోగ్యంగా జీవిద్దాం.

 

Go to top