" ధ్యానం చేస్తే .. మాస్టర్లందరూ మనతో వుంటారు "

 

 

పేరు : R. కస్తూరి
హోదా : అసిస్టెంట్ సెక్రెటరీ
విభాగం: వ్యవసాయ శాఖ

 

పాఠకులందరికి ధ్యానాభివందనాలు.


ధ్యానం వలన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దాని వలన ఆఫీసులో మరి ఇంట్లో కలిగే ఒత్తిడిని తట్టుకోగలుగుతున్నాను. ధ్యానం వలన నా ఆరోగ్యం బాగుంటోంది. గ్యాస్ట్రిక్, అసిడిటి లాంటి సమస్యలు తగ్గాయి. ధ్యానంలో నాకు యోగుల దర్శనం అయింది. ఒక్కరోజు ధ్యానం చేయకుండా ఉంటే ఏదో పోగుట్టుకున్నట్టు ఉంటుంది.


మా అబ్బాయితో పది నిమిషాలు ధ్యానం చేయిస్తాను. తనకు చాలా హాయిగా ఉందని చెబుతున్నాడు. నాకు తెలిసినవాళ్ళకు ధ్యానం నేర్పుతున్నాను. వాళ్ళు ధ్యానం చేస్తున్నారు. వాళ్ళకూ చాలా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి.


సందేశం: ధ్యానం చేయడం చాలా మంచిది. అందరం ధ్యానం చేద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం.. జన్మ ధన్యం చేసుకుందాం. ధ్యానం చేస్తే మాస్టర్లందరూ ఎప్పుడూ మనతో వుటారు.

 

Go to top