" అన్నిటికంటే పై స్థాయి ధ్యానం "

 


పేరు : D. శ్రీలక్ష్మి
హోదా : అకౌటెంట్
విభాగం : కో-ఆపరేటివ్ సొసైటీ

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

నేను బాగా పూజలు, వ్రతాలు చేసేదానిని. శ్రీమతి సూర్యప్రభ మేడమ్ మరి శ్రీమతి లీలా మేడమ్ మా సొసైటీలో వారం రోజుల పాటు ధ్యానం క్లాసులు తీసుకున్నారు. అప్పుడు నాకు ధ్యాన పరిచయం అయ్యింది. "పూజలు, వ్రతాలు, జపాలు మరి స్తోత్రాలు .. వీటన్నింటికంటే పై స్థాయిది ధ్యానం" అని నాకు అప్పుడు తెలిసింది. నేను పూజలు, వ్రతాల ద్వారా కూడా పొందని మానసిక ప్రశాంతతనూ, మానసిక ఆనందాన్నీ నేను పిరమిడ్ ధ్యానం ద్వారా పొందాను.

 

రోజు 15 నిమిషాల నుండి అర్ధ గంట వరకు నేను ధ్యానం చేస్తాను. ఇది వరకు నాకు డస్ట్ ఎలర్జీ ఉండేది. రోజు మందు బిళ్ళలు వాడేదాన్ని. ఇంట్లో, ఆఫీసులో పని ఒత్తిడి వలన.. విసుగు, కోపం తొందరగా వచ్చేవి. ధ్యానం చేస్తున్నప్పటి నుండి కోపం, విసుగు తగ్గిపోయింది. డస్ట్ ఎలర్జీ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు నేను మందు బిళ్ళలు కూడా మానివేసాను. పనిలో ఏకాగ్రత పెరిగింది. ధ్యానం ద్వారా నేను పొందే ఆనందం, మానసిక ప్రశాంతత చెప్పనలవి కానిది అది అనుభవిస్తేనే తెలుస్తుంది.

 

సందేశం: మనమందరం ధ్యానాన్ని మన జీవితాలలో ఒక భాగంగా చేసుకుందాం. మన జీవితాలను జ్ఞానవంతగా మలుచుకుందాం.

 

Go to top