"ధ్యానమే గొప్ప వైద్యం"

 

పేరు : D. అరుణ
హోదా : సెక్షన్ ఆఫీసర్
విభాగం : ప్లానింగ్

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

సచివాలయంలో శ్రీమతి సూర్యప్రభగారు మరి శ్రీమతి లీలగారు మాకు ధ్యానం గురించి చెప్పటమే కాకుండా చేయించటం మొదలుపెట్టారు. నాకు ఈ మధ్య అంటే నవంబరులో చెస్ట్ నొప్పి వస్తే గ్లోబల్ హస్పిటల్‌లో టెస్ట్‌లు చేయించాను. వారు వెంటనే "జాయి‍న్ కండి; అంజియోగ్రామ్ తీయాలి" అన్నారు. కార్డియాలజీ కన్సల్‌టెంట్‌గారు మందులు రాసిచ్చారు. రెండు రోజులు ఈ మందులు వాడుతూ నిమ్స్‌లో అపాయింట్‌మెంట్ తీసుకున్నాను. రెండు రోజులు ఆ మందుల వల్ల విపరీతంగా తలపోటు వచ్చింది.

 

మా చెల్లి, అక్క నా బాధ చూసి "గ్లోబల్ హాస్పిటల్‌కు వెళదాం" అన్నారు కానీ "నేను ధ్యానం చేస్తున్నా, మీరు ఏమీ భయపడవద్దు" అని అలాగే ధ్యానం చేస్తూ తలపోటును భరించాను.

 

రెండు రోజుల తర్వాత నిమ్స్‌లో ‘చెకప్’ కోసం వెళ్ళాను. ఆ తర్వాత "అన్ని టెస్ట్‌లు చేసారు, మీకు ఏ ప్రాబ్లమ్‍ లేదు" అని చెప్పారు. నేను సమయం వున్నప్పుడల్లా బస్‌లో వెళ్తూ కూడా ధ్యానం చేస్తున్నా. దీనివల్ల నాకు ధైర్యం, ఏ కష్టం వచ్చినా తట్టుకునే శక్తి వచ్చింది.

 

మా అమ్మగారు దాదాపు 15 సంవత్సరాలు ధ్యానం చేసారు. రెండు సంవత్సరాల క్రితం 72 సంవత్సరాల

 

వయస్సులో చనిపోయారు. ఏ రోజూ ఒక్క టాబ్లెట్ కూడా వాడేది కాదు. అదే బాటలో నేను నడవాలని ప్రయత్నిస్తున్నాను. ఎంత శ్రద్ధగా ధ్యానం చేస్తామో అంత లాభం పొందుతాం. నా అనుభవం మీ అందరితో పంచుకోవడానికి శ్రీమతి లీలగారి ప్రోత్సాహం ఎంతో వుంది. మాకందరికీ పిరమిడ్ ధ్యాన పద్ధతిని అందించిన బ్రహ్మర్షి పత్రీజీకి, పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ మాస్టర్స్‌కు మా ధ్యానాభివందనాలు.

 

సందేశం: గట్టి నమ్మకంతో ధ్యానం చేయడం ద్వారా మందులు లేకుండా జీవించగలం మరి జీవితాన్ని ఉల్లాసంగా గడపగలం. కనుక మనమందరం ధ్యానం చేద్దాం.

 

Go to top