" ధ్యానమే గొప్ప మెడిసిన్ "

 

 

పేరు: T. సమీనా
హోదా : అసిస్టెంట్ సెక్రెటరీ
విభాగం : హోం శాఖపాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

నా అనుభవపూర్వకంగా ధ్యానం వలన నేను సాధించింది ఏమిటంటే .. నేను పోగొట్టుకున్న శక్తిని తిరిగి సంపాదించుకోగలిగాను, ఎంతటి పనైనా ఇంట్లో గాని, ఆఫీసులో గాని చాలా సునాయాసంగా చేసుకోగలుగుతున్నాను. ధ్యానం వలన నాకు B.P. కాంట్రోల్ అయింది. నా అనారోగ్య సమస్యలు మోకాళ్ళ నొప్పులు, కిడ్నీ ప్రాబ్లమ్ మరి లెఫ్ట్ సైడ్ హెడ్ సరిగ్గా పని చేయదేమోననిపించేది కానీ ఇప్పుడు మామూలుగా ఉంది. "స్పిరిచ్యువల్ రియాలిటీ" C.D. చూస్తున్నంతసేపు ఏదో లోకంలోకి వెళ్ళినట్లనిపించింది. అంతే! అప్పట్నుంచి నేను ధ్యానం చేయడం మొదలు పెట్టాను.

 

పత్రిగారు ఎవరో నాకు మొదట్లో తెలియదు. ఇప్పుడిప్పుడే నేను పత్రీజీ గురించి తెలుసుకొంటూ, ధ్యానం చేయడమే కాకుండా ఇంట్లో అందరితోనూ చేయిస్తూ, బంధుమిత్రులతో కూడా చేయిస్తూ నేను ఎంతో ఆత్మ తృప్తిని పొందుతున్నాను.

 

సందేశం: మనమందరం ధ్యానం చేసి, ఆత్మశక్తిని పెంచుకొని ఆరోగ్యంగా జీవిద్దాం.

 

Go to top