" ఆత్మవిశ్వాసం పెరిగింది "

 

పేరు : P. శ్రీదేవి
హోదా : డేటా ఎంట్రీ ఆపరేటర్
విభాగం : పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్పాఠకులందరికీ ధ్యానాభివందనాలు

 

2009 లో నేను ధ్యానం చేయడం ప్రారంభించాను. ధ్యానం చేయడం వల్ల నాలో చాలా మంచి మార్పులు వచ్చాయి. నాలో ఇంతకుముందు ఉన్న కోపం, చిరాకు తగ్గాయి. మానసిక స్థైర్యం పెరిగింది. " ఏ పనైనా నేను చేయగలను" అన్న ఆత్మ విశ్వాసం నాలో బాగా పెరిగింది. ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి నుండి బయటపడి కీలకమైన నిర్ణయాలు సరిగ్గా తీసుకోగలుగుతున్నాను. ధ్యానం చేయడం వల్ల ఆరోగ్యం పరంగా చాలా మెరుగయ్యాను. "ధ్యానం చేస్తున్నంత వరకు నాకు ఎలాంటి భయం, కష్టం, అనారోగ్యం మరి ఎలాంటి ఒత్తిడి ఉండదు" .." ఏ కష్టం వచ్చినా తట్టుకోగలను అన్న నమ్మకం ఏర్పడింది.

 

ధ్యానం చేయడం ద్వారా, స్వాధ్యాయం వల్ల నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. పత్రీజీ పుట్టిన రోజు నాడు ధ్యానం చేస్తున్నప్పుడు నా వెనకాల ఒక పెద్ద కాంతి పుంజాన్ని చూసాను. నాకు ఎంతో ఆనందం కలిగింది.

 

పిరమిడ్ మాస్టర్ల ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నాను. చాలా ఆనందంగా జీవిస్తున్నాను. పిరమిడ్ మాస్టర్లందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

 

సందేశం: మనమందరం ధ్యానం చేద్దాం. మనం పిరమిడ్ మాస్టర్స్ అవుదాం.

 

 

Go to top