" నాంపల్లి బాబా దర్శనం ఇచ్చారు "

 

 

పేరు : A. అపర్ణ
హోదా : అటెండర్
విభాగం : పబ్లిక్ ఎంటర్‌ప్రైజస్

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

ధ్యానం మొదలుపెట్టిన తరువాత నాకు ఎన్నో ప్రయోజనాలు కనిపించాయి. జ్ఞాపకశక్తి బాగా పెరిగింది. తొందరగా అలసిపోయి శరీరం నొప్పులు వచ్చే తత్వం పోయి .. కష్టపడి పని చేయగలుగుతున్నాను.

 

ఎకాగ్రత బాగా పెరిగింది. ధ్యానంలోకి వచ్చిన తరువాత గర్వం, కోపం తగ్గి .. అందరితో కలిసిమెలిసి ఉండగలుగుతున్నాను. ప్రతి విషయంలో సరియైన నిర్ణయం నేను తీసుకోగలుగుతున్నాను. ధ్యానంలో చాలా ఆధ్యాత్మిక అనుభవాలు కూడా వచ్చాయి. ధ్యానంలో అనేక మంది దేవుళ్ళు, దేవతలు కనిపించి నన్ను ఆశీర్వదించారు. నా జీవితంలో ప్రతి విషయాన్నీ ఆనందంగా స్వీకరించగలుగుతున్నాను.

 

నాంపల్లి బాబా సమాధి ముందు ధ్యానం చేసినప్పుడు సాక్షాత్తు బాబాయే సమాధి నుండి ఒక జ్యోతి రూపంలో పైకి వచ్చి నాకు దర్శనం ఇచ్చారు. ఇంతటి గొప్ప ధ్యానాన్ని మాకు తెలియజేసిన పత్రీజీకి హృదయపూర్వక కృతజ్ఞతలు.

 

సందేశం: ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా కనబడని దేవుళ్ళు, దేవతలను .. ధ్యానం చేయడం ద్వారా చూడగలం మరి వారి ఆశీర్వాదం పొందగలం. కనుక మనమందరం ధ్యానం చేద్దాం.

 

 

 

Go to top