" పరమ గురువు బ్రహ్మర్షి పత్రీజీ "

 

పేరు : T. లక్ష్మీ సుజాత
హోదా : అసిస్టెంట్ సెక్షన్ అఫీసర్
విభాగం : ప్రణాళిక విభాగం

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

మా సచివాలయంలో 2008 మే నెలలో ఒక వారం రోజులు ధ్యానం క్లాసులు నాగేంద్రమణి, సూర్యప్రభ గార్లు నిర్వహించారు. నాకు ధ్యానం అప్పుడే పరిచయం అయ్యింది .. నేను కూడా అప్పటినుండి ఆనాపానసతి ధ్యానంను విడవకుండా ఇప్పటి వరకు మా సచివాలయ సహోద్యోగులతో కలిసి లంచ్ టైమ్‌లో సామూహిక ధ్యానంను ఎంతో చక్కగా చేస్తున్నాను.

 

మొదట్లో పదిహేను మందితో మొదలైన పిరమిడ్ ధ్యానం ఇప్పుడు 1000 కు పైగా సభ్యులతో ఎవరి బ్లాకులో వారు చేసుకునే విధంగా పై అధికారుల సహాయంతో అద్భుతంగా కొనసాగుతోంది. దీనివలన మా అందరిలో ఆత్మవిశ్వాసం, దృఢసంకల్పం, శారీరక మరి మానసిక ఆరోగ్యాలలో గణనీయ మార్పులు చోటు చేసుకున్నాయి. ఏ విషయాన్నైనా ఎటువంటి అసౌకర్యాన్ని అయినా చాలా ‘కూల్’ గా స్వీకరించే మనోధైర్యం మాలో నెలకొంది.

 

మనం ఎదుర్కొనే ప్రతి సమస్య పూర్వ జన్మ కర్మఫలం యొక్క ఫలితం మరి మన ఆలోచనల ఫలితమే అనే జ్ఞానం పొందడం వలన ఇప్పుడు ఆ సమస్య కారకులపై ఎటువంటి కోపం లేకుండా "ఇది మనం తెచ్చుకున్న కర్మఫలం" అని "దీనిని సాధ్యమైనంత వరకూ.. ధ్యానం ద్వారా నివృత్తి చేసుకోవాలి" అనే జ్ఞానం మాలో చోటు చేసుకుంది.

 

ఇంతటి అద్భుతమైన ఆనాపానసతి ధ్యానంను, అందరికీ అందుబాటులోకి తీసుకువస్తూన్న పరమ గురువులు బ్రహ్మర్షి పత్రీజీకి నా హృదయపూర్వక ఆత్మప్రణామాలు.

సందేశం : ధ్యానం వల్లనే జ్ఞానం .. జ్ఞానం వల్లనే ముక్తి. అందరం ధ్యానం చేద్దాం .. ముక్తిని పొందుదాం.

 

Go to top