" నా జీవితం ఆనందమయం "

 

 

పేరు: V. నిర్మల
హోదా: డిప్యూటీ సెక్రెటరీ
విభాగం: ప్రధాన పరిపాలన

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

ఆగస్ట్, 2009 నుండి నేను ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేసిన తరువాత నా మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటోంది. ఇదివరకు ఆఫీసులో ఫైల్స్ ఎక్కువగా చూసిన రోజు చాలా అలసటగా ఉండేది. కానీ ధ్యాసం ప్రారంభించాక ఎన్ని పైల్స్ చూసినా, ఇంట్లో ఎంత పని చేసినా .. అలసట అనేది లేకుండా ఉంది.

 

ధ్యానంలో లేని సమయంలో కూడా అసలు వ్యతిరేక ఆలోచనలు మరి ఏ ఇతర అనవసర ఆలోచనలు కూడా ఏవీ రావట్లేదు. ధ్యానంలో ఉండగా ఒక తెల్లని కాంతి మాత్రం కనిపిస్తూంటుంది. ఏదో శక్తి ప్రవాహం నాలో ప్రవేశించినట్లు అనిపిస్తూ నా తల, శరీరం అప్పుడప్పుడు బరువుగా అవుతుంటుంది.

 

ఆఫీసులోనే కాకుండా ఇంట్లో రాత్రి 9 గంటల నుండి 10 గంటల వరకు నలభై రోజులు ధ్యానం చేసినప్పుడు ఏదో శక్తి శరీరమంతా ప్రవహించినట్లనిపించింది. ధ్యానం, స్వాధ్యాయం మరి సజ్జన సాంగత్యం నా జీవితాన్ని ఎంతగానో మార్చేసాయి. ప్రతి సంఘటనను నేను స్వీకరించే విధానం, ఎదుర్కొనే విధానమే మారిపోయింది. అందరి పట్ల మిత్రత్వం, ప్రేమ భావనలు పెంపొందాయి.

 

సందేశం : ధ్యానం ద్వారా అన్ని పనులను చక్కగా చేయగలం. "మన సామర్థ్యం అనంతం" అని ధ్యానం ద్వారా అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చును. కనుక మనమందరం ధ్యానం చేద్దాం.

 

Go to top