" ఆనాపానసతి సరళీకృత మార్గం "

 

 

పేరు : డా|| T. పురంధర్
హోదా : అసిస్టెంట్ డైరెక్టర్
విభాగం : స్టేట్ ఆర్కైవ్స్

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

" శ్వాస మీద ధ్యాస " .. ఇదో ఉత్తుంగ తరంగం. మానవ కోటికి ఓ తారక మంత్రం. కోరుకున్నది దొరికే ఓ సరళీకృత మార్గం. బ్రహ్మర్షి పత్రీజీకి నా ధన్యవాదాలు.

 

మానవజన్మ జీవకోటిలో అత్యుత్తమమైనది. అనవసర విషయాలపై కలత చెందకుండా ఈ జన్మను సాకారం చేసుకోవాలి. " ధ్యాన జగత్ " లోనికి ప్రవేశించాలంటే మన చింతలన్నీ మానివేసి, " శ్వాస మీద ధ్యాస " ఉంచినట్లైతే బుద్ధి బలం, మనోశక్తి పెంపొందించబడి స్వస్థత చేకురుతుంది. భగవద్గీతలో చెప్పినట్లు విషయలోలత వల్ల, మానవ ప్రగతి కంటే విచ్ఛిన్నమే జరుగుతుంది.

 

కనుక విషయలోలతలన్నీ ప్రక్కన పెట్టి ప్రతినిత్యం కనీసం మన వయస్సు ఎంతో అన్ని నిమిషాలు ధ్యానం చేయాలి. " శ్వాస మీద ధ్యాస వుంచితే అనన్య మనో వికాసం జరగటం సత్యం " అని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను.

 

సందేశం: " సాధనమున పనులు సమకూరు ధరలోన " అన్నట్లు - మానవుడు ధ్యాన, జ్ఞాన సాధనతో సాధించలేనిది అంటూ ఏదీ లేదని తెలియచేస్తున్నాను. కనుక మనమందరం ధ్యానం చేద్దాం.

 

Go to top