" ప్రేమతత్వంతో జీవిద్దాం "

 

 

పేరు : B. రాజేశ్వరి
హోదా : అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
విభాగం : ప్రధాన పరిపాలన

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

నేను గత కొన్ని సంవత్సరాలుగా ‘యోగా’ చేస్తున్నాను. సచివాలయంకు నేను సంవత్సరం క్రితం వచ్చాను. సచివాలయంలో నిర్వహించే ధ్యాన తరగతుల ద్వారా ధ్యానం గురించి తెలుసుకొని ఇప్పుడు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తునాను. యోగా ద్వారా శారీరక ఆరోగ్యం ఉన్నప్పటికీ, మానసిక ఆందోళన కొంత వుండేది. ధ్యానం చేయడం ద్వారా మానసికంగా నాలో ఎంతో మార్పు వచ్చింది.

 

జీవితం ఒక వరం. దానిని సార్థకం ఎలా చేసుకోవాలో ఇప్పుడు ధ్యానం ద్వారా మాత్రమే తెలిసింది. ధ్యానం చేస్తుంటే మనసంతా ప్రశాంతత ఏర్పడుతోంది. అందుకని అందరూ ధ్యానం గురించి తెలుసుకొని ధ్యాన సాధన ద్వారా ప్రేమతత్వాన్ని పెంపొందించుకోవాలని ఆశిస్తున్నను.

 

సందేశం : సరియైన ధ్యానాన్ని చేద్దాం; అంటే మన పిరమిడ్ ధ్యానాన్ని చేద్దాం; మన జీవితాలను సార్థకం చేసుకుందాం.

 

 

Go to top