" ధ్యాన జగత్తుని నిర్మిద్దాం "

 


పేరు : K. సరోజిని
హోదా : అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
విభాగం : పశు సంవర్ధక

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు. ఒకటిన్నర సంవత్సరం నుండి నేను ధ్యానం చేస్తున్నాను. మా ఫ్రెండ్ శ్రీమతి శివరమ్య గారి ద్వారా నాకు ధ్యాన పరిచయం అయింది. నేను ధ్యానంలోకి రాకముందు కాళ్ళనొప్పి, సైనస్ మరి చీలమండలనొప్పులతో బాధపడేదాన్ని. ఇంకా నాకు కోపం కూడా ఎక్కువగా ఉండేది. ధ్యానం మొదలుపెట్టినప్పటి నుండి క్రమంగా నాకు వున్న నొప్పులు అన్నీ తగ్గిపోయాయి. నాకు వున్న కోపం కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు ఎంతో సంతోషంగా వున్నాను.

 

ధ్యానం మొదలుపెట్టినప్పటి నుంచి మాంసాహారం పూర్తిగా మాని శాకాహారిగా మారిపోయాను. అదే సమయంలో పత్రీజీ గురించి తెలుసుకున్నాను. అదృష్టవశాత్తు మూడుసార్లు పత్రి గారిని కలవడం కూడా జరిగింది. ధ్యానానికి సంబంధించిన అనేక పుస్తకాలను చదువుతూ నిరంతరం ధ్యానం చేస్తూ వున్నాను. నాకు తెలిసిన వాళ్ళందరికీ ధ్యానం గురించి చెబుతున్నాను.

 

శ్రీ దాట్ల రాయజగపతిరాజు గారి ఆధ్వర్యంలో జరిగిన శాకాహార ర్యాలీలో పాల్గొన్నాను. అందులో పాల్గొన్నప్పడు నేను పొందిన ఆనందం మాటలలో చెప్పలేను! అంతులేని ఆనందాన్ని అనుభవించాను.

 

ధ్యానం ద్వారా మనల్ని మాయలో నుంచి బయట పడేస్తూ మోక్షమార్గంలోకి తీసుకువెళ్తూన్న బ్రహ్మర్షి పత్రిగారికి నా ఆత్మప్రణామాలు.

 

సందేశం: ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి ఆనందాన్నీ, ఆరోగ్యాన్నీ పొందాలని కోరుకుంటున్నాను. ఇంతటి మహద్భాగ్యాన్ని అందించిన మన పరమగురుదేవులు బ్రహ్మర్షి పత్రీజీ బాటలో నడుద్దాం. ధ్యాన జగత్తు నిర్మాణానికై మన వంతు కృషి చేద్దాం. ధ్యానమహాచక్రాలను విజయవంతం చేద్దాం.

 

ప్రతి ఒక్కరూ పత్రీజీ ఆశయమైన 2016 సంవత్సరానికి పిరమిడ్ జగత్ మరి 2020 సంవత్సరానికి శాకాహార జగత్ కావాలని .. మనమందరం అందులో భాగస్వాములం కావాలని ఆకాంక్షిస్తున్నాను.

 

Go to top