" ఎంత పనైనా చేయగలుగుతున్నాను "

 

 

పేరు : A. హేమారాణి
హోదా : అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
విభాగం : పశు సంవర్థకపాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

మా కొలీగ్ శ్రీమతి రమ్య మేడమ్ ద్వారా ఏప్రిల్ 2009 లో నేను పిరమిడ్ ధ్యానంలోకి వచ్చాను. మూడు నెలల వరకు నాకు ఎలాంటి ధ్యానానుభవాలు కలగలేదు. అందరికీ ఏవేవో అనుభవాలు వస్తున్నాయి. నాకు ఎలాంటి అనుభవాలు రావట్లేదు. నాకు ధ్యానం పడదేమో అనుకొని "ఇక ధ్యానం మానివేద్దాం" అనుకుంటూన్న తరుణంలో నాకు ధ్యానానుభవాలు కలగటం మొదలైంది. చాలా మంచి మంచి అనుభవాలు కలిగాయి.

 

ధ్యానంలోకి రాకముందు నాకు స్కిన్ ఎలర్జీ వుండింది. గత పది సంవత్సరాల నుండి అన్ని రకాల మందులు వాడాను. మందులు వాడినా 2,3 నెలల వరకు తగ్గినట్లు ఉండేది. తర్వాత మళ్ళీ మొదలయ్యేది. కానీ ధ్యానంలోకి వచ్చాక నాకు ఈ స్కిన్ ఎలర్జీ పూర్తిగా తగ్గిపోయింది.

 

ఇంటి పని, ఆఫీసు పని వలన చాలా తొందరగా అలసిపోయేదాన్ని .. దానికి తోడు నాకు ఎక్స్‌ట్రా పని ఇచ్చారు. పని ఒత్తిడి వలన తరుచుగా జబ్బు పడేదానిని. ధ్యానంలోనికి వచ్చాక నా ఆరోగ్యం బాగుపడటమే కాకుండా నా మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా వుంటుంది. మైండ్ ఎప్పుడూ కూల్‌గా వుంటోంది. ఉదయం ఆఫీస్‌కి వచినప్పుడు మైండ్ ఎంత ప్రెష్‌గా వుంటుందో సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అంతే ఫ్రెష్‌గా వుంటోంది. జ్ఞాపక శక్తి, గ్రాస్పింగ్ పవర్, క్విక్ డెసిషన్ మేకింగ్ మరి కాన్ఫిడెన్స్ బాగా పెరిగాయి.

 

ధ్యానంలోకి వచ్చాక బాగా స్టడీ చేసి ఇదివరకటి కంటే ఎక్కువ పని బాగా చేయగలుగుతున్నాను. ఇప్పుడు వీటి ద్వారా నాకు ఆఫీసర్స్‌తో "మంచి పనిచెయ్యగల అమ్మాయి" అనే పేరు, గుర్తింపు వచ్చింది. ఒక ఉద్యోగికి ఇంతకంటే కావలసింది ఏముంటుంది! అందుకే ప్రతి ఉద్యోగి ధ్యానం చెయ్యడం ద్వారా తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా తన విధిని కూడా సక్రమంగా నిర్వహించగలుగుతారు.

 

ఇప్పుడు నేను ఆఫీసు పని, ఇంటి పని మరి వంటపని .. ఇలా అన్ని పనులూ అలసట లేకుండా చేయగలుగుతున్నాను.

 

నాలాగే ప్రతి ఒక్కరూ ధ్యానం ద్వారా ఆరోగ్యవంతులు కావడమే కాకుండా ఆనందమయమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. ఇదివరకు నాకు జీవితం అంటే రొటీన్ మరి బోర్‌గా వుండేది. కానీ ఈ ధ్యానంలోకి వచ్చాక జీవితంలో వున్న ఆనందాలను ఎంజాయ్ చేయగలుగుతున్నాను. ప్రకృతిలోని అందాలను అస్వాదించగలుగుతున్నాను. ప్రతి ఒక్కరూ ఈ ధ్యానం ద్వారా లైఫ్‌ని ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నా ఆత్మాభివందనాలు.

 

సందేశం : ప్రతి రోగానికీ మూలకారణం మానసిక అందోళనలే. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందువలన ప్రతి మనిషికి తన అనారోగ్యానికి పెట్టే ఖర్చులు తగ్గిపోతాయి. ప్రతి గవర్నమెంట్ కోరుకునేది తన ఉద్యోగి యొక్క ఆరోగ్యమే. ప్రతి ఆఫీసులో ఉద్యోగుల యొక్క వెల్‌ఫేర్ కొరకు కనీసం అర్థగంట తప్పనిసరిగా ధ్యానానికి కేటాయిస్తూ ఆర్డర్‌ని పాస్ చేయాలి. దాని ద్వారా ఉద్యోగుల యొక ఆరోగ్యం బాగుపడటమే కాకుండా ఆఫీసు పని కూడా చాలా బాగా జరుగుతుంది.

 

Go to top