" అహింసా-ధ్యాన ప్రపంచాన్ని స్థాపిద్దాం "

 

 

పేరు : M. లీల
హోదా : సెక్షన్ ఆఫీసర్
విభాగం : ప్రధాన పరిపాలన

 

పాఠకులందరికీ ధ్యానాభివందనాలు.

 

బ్రహ్మర్షి పత్రీజీకి నా ఆత్మాభివందనాలు. పత్రీజీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన, నాకు ఒక తండ్రిగా, తల్లిగా, స్నేహితుడిగా, గురువుగా మరి ప్రత్యక్ష దైవంగా అనిపిస్తారు. పత్రీజీ నాకు జీవితాన్ని ఆనందంగా ఎలా జీవించాలో నేర్పించిన మహానుభావుడు. "ఆయనను మార్గదర్శకంగా చేసుకుని జీవించాలి" అని చాలాసార్లు అనిపిస్తుంది.

 

సచివాలయంలో ఇరవై సంవత్సరాల నుండి నేను ఉద్యోగం చేస్తున్నాను. నవంబర్, 2008లో నాగేంద్రమణి గారి ద్వారా నేను ధ్యానం చేయడం ప్ర్రారంభించాను.

 

నేను స్పాండిలైటిస్, థైరాయిడ్, చర్మవ్యాధి, వెన్నునొప్పి మొదలైన అనారోగ్యాలతో చాలా బాధపడుతూ ఉండేదాన్ని. ధ్యానం చేయగా చేయగా నాకు స్పాండిలైటిస్ మొత్తం పోయింది. అప్పటి నుండి నాకు ధ్యానం మీద నమ్మకం వచ్చింది. ఇంటి పనిలో, ఆఫీసు పనిలో, మాట్లాడడంలో, చేష్టలలో మరి ఇతర పనులలో చాలా మార్పులు రాసాగాయి. నాలో ఆత్మస్థైర్యం పెంపొందింది. నాకు భయం పోయి ధైర్యం వచ్చింది. కోపం, చిరాకు మటుమాయమయ్యాయి.

 

ప్రతిరోజూ పత్రిగారి C.D. లు వినడం వల్ల, ఆయన యొక్క మాటల ప్రభావం నా మీద చాలా కనపడింది. దాంతో నేను "మందులు వాడకూడదు" అని ఖచ్చితంగా అనుకుని, అక్టోబర్ 2009 నుండి మందులు వాడడం మానేసాను. కానీ నా మనస్సులో ఒక ఆందోళన ఉండేది. థైరాయిడ్ రోగానికి ఎల్‌ట్రాక్సిన్ అనే మందుబిళ్ళ రోజు ఉదయాన్నే జీవితాంతం వేసుకోమని డాక్టర్‌గారు చెప్పారు. ధ్యానం మీద నమ్మకంతో .. నాకు ఏమైనా అవ్వనీ (డు ఆర్ డై) అని మందులు వేసుకోవడం మానేసాను. తరువాత నా జీవితం ఇంకా ఆనందంగా తయారు కావడం చూసి ఆశ్చర్యం వేసింది.

 

"జీవితాన్ని జీవించడానికి ఇదే కరెక్టు పద్ధతి" అని నాకు కన్‌ఫర్మ్ అయ్యినట్లు భావించి, అప్పటి నుండి నేను ఏ మందులూ లేకుండా చాలా ఆనందంగా, ముందుకన్నా ఎక్కువ పనులు హుషారుగా చేయగలుగుతున్నాను. అయిదు గంటలు మాత్రమే నేను నిద్రపోయినా కూడా, అలసట లేక ఇంకా ఎన్నో ధ్యాన ప్రచార కార్యక్రమాలు చేయగలుగుతున్నాను.

 

2010 లో మా అమ్మగారు చనిపోయినా కూడా నేను నిర్భయంగా ఉండడానికి ధ్యానం నాకు చాలా తోడ్పడింది. ధ్యానం ద్వారా "మరణం లేదు" అన్న సత్యం అనుభవపూర్వకంగా తెలుసుకోగలిగాను. అంటే మరణం తరువాత కూడా జీవితం ఉంది. మా అమ్మగారు మళ్ళీ భూమి మీదకు వస్తారు. ఆవిడ తన జీవితంలో అన్ని పనులూ సక్రమంగా చేసి శరీరం వదిలిపెట్టారు. "నేను కూడా మా అమ్మలాగా అన్ని పనులూ నా కర్తవ్యం ( పర్పస్ ఆఫ్ లైఫ్) సవ్యంగా చేసి శరీరం వదలాలి" అని నాలో ఒక మంచి భావన కలగడం వల్ల నాలో దుఃఖం నశించి చాలా ధైర్యం వచ్చింది. నేను "తల్లి లేని ఒంటరిదానిని" అన్న భావననూ, "దుఃఖించుకుంటూ జీవితం గడపాలి" అనే భావననూ .. ధ్యానం చెరిపివేసింది.

 

పుస్తకాలు నాకు మార్గదర్శకాలు అయ్యాయి. కనుక, పుస్తకాలు చదవడం నా జీవితంలో భాగంగా చేసుకోవాలనిపించింది. ధ్యానం చేయక ముందు నాకు ఒక్క పుస్తకం కూడా చదవడం అలవాటు లేదు. కానీ ఇప్పుడు ఇంకా చదవాలని ఆరాటంగా ఉంది. ఎందుకంటే పుస్తకాల ద్వారా ఎంతో జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాను. "పుస్తకాలు చదివి వాటిని ఆచరించాలి .. అప్పుడే మనకు పురోగతి" అని తెలుసుకున్నాను.

 

నాకు ఆరోగ్యం బాగా లేనప్పుడు, "నా ఇద్దరు పిల్లల బాధ్యతలు తీరిన తరువాత దేవుడు నన్ను తీసుకుని వెళితే బావుండును" అని ఎప్పుడూ అనుకునే దాన్ని. కానీ ధ్యాన జీవితం మొదలైన తరువాత నా భావనలు మారిపోయి, "ఇంకా చాలా సంవత్సరాలు బ్రతకాలి, ఇంకా నేను చేయవలసిన పనులు (ధ్యానానికి సంబంధించిన) ఉన్నాయి" అనిపించడం ఆశ్చర్యంగా ఉంది. "నా ఇల్లే కాదు, రక్తసంబంధీకులే కాదు.. అందరూ నా వాళ్ళు" అన్న భావన వచ్చింది. క్రొత్త వాళ్ళకు ధ్యానం నేర్పించిన తరువాత వాళ్ళ దగ్గర నుండి వచ్చిన స్పందన నాకు చాలా ఆనందాన్నీ, ప్రోత్సాహాన్నీ ఇచ్చింది.

 

నేను పుట్టపర్తి సాయిబాబా భక్తురాలిని. నాకు భజనలు అంటే చాలా ఇష్టం. కనుక ప్రతివారం భజన చేసేదానిని. పత్రిగారు మనుషులు "భగవంతుళ్ళారా" అని సంబోధించి "మీరే దేవుళ్ళు! పూజలు, భజనలు మానేసి అంతర్ముఖం అవ్వండి (స్వస్వరూపానుసంధానం)" అని చెప్పడం విని నేను చాలా మధనపడ్డాను.

 

భజనలు, పూజలు ఎలా వదిలిపెట్టాలో నాకు తెలిసేది కాదు. "పూజలు, భజనలు చేయకపోతే భగవంతుడు శిక్షిస్తాడు" అని నాకు చాలా భయంగా ఉండేది ఆ సమయంలో ధ్యానం చేయగా, చేయగా ఒకరోజు నాకు పూర్తి వివరంగా తెలిసివచ్చింది. ఒక గురువారం బాబా పూజ చేయలేక పోయినందువల్ల బాధపడుతూ నేను ఆఫీసుకి వెళ్ళాను. లంచ్ సమయంలో అందరం ధ్యానం చేస్తున్నప్పుడు, పుట్టపర్తి బాబా చాలా పెద్ద ఆకారంతో కనపడి నాకు ఉన్న అనుమానాల్ని తీర్చివేసారు! పూజలకన్నా, భజనలకన్నా మనం జీవించే విధానం సరియైనదిగా ఉండాలి అని మరి కర్తృత్వ భావన లేకుండా ( ఏమీ ఆశించకుండా) సేవ చేయాలని తెలిసింది. భజనలో దొరికే ఆనందం కన్నా ఎన్నో రెట్ల ఆనందం ధ్యానంలో దొరికింది.

 

ఎవరైన నన్ను కోప్పడితే, చాలా రోజులు ఆ విషయాన్నే తలచుకుంటూ నేను చాలా బాధపడేదాన్ని, ఏడ్చేదాన్ని. కానీ ఇప్పుడు ధ్యానం చేసిన తరువాత "వాళ్ళు ఏదో సమస్యలో కోప్పడ్డారు, అది వాళ్ళ సమస్య! నేనేంటో నాకు తెలుసు, నేను ఎందుకు వ్యక్తిగతంగా తీసుకోవాలి?" అని ఆలోచించిన తరువాత నాకు ఏమీ బాధ కలగటం లేదు, ఫీలింగ్ కూడా లేదు. ఏ విషయంలోనైనా నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను.

 

"నలభై ఏళ్ళ జీవితం వృధాగా అయిపోయిందే" అనిపించి బాధపడ్డాను. ధ్యానం గురించి తెలిసిన తరువాత "సమయం వృధా చేయకూడదు" అని తెలుసుకుని ప్రాంప్ట్‌గా అన్ని ‍పనులు సక్రమంగా, పద్ధతిగా చేయాలని అనుకుని చేస్తున్నాను.

 

ధ్యానం చేసే పిల్లలను చూసాక, నా పిల్లలకు కూడా చిన్నప్పటి నుండే ధ్యానం నేర్పించాలని వాళ్ళకు పట్టుబట్టి రోజు చెప్పగా, నా ఇద్దరు పిల్లలు ఇప్పుడు రోజూ నేను లేకపోయినా ధ్యానం చేస్తున్నారు. మా కుటుంబంలాగా అన్ని కుటుంబాలూ ధ్యాన కుటుంబాలూ అవ్వాలన్న కోరిక, అయ్యి తీరుతుంది అన్న నమ్మకం కూడా నాకు ఉంది.

 

నాకు ప్రతిరోజూ, ఒక క్రొత్త జీవితంలా అనిపించసాగింది.
నేను రెండు ముఖ్య విషయాలు తెలుసుకున్నాను.
మొదటిది : మనం చేసేవి చేస్తే, మనకు కావలసినవి మన దగ్గరకు వస్తాయి.
రెండవది: ప్రాపంచిక జీవితం ఆనందంగా ఉండాలి అంటే ఆధ్యాత్మిక జీవితం సరిగ్గా ఉండాలి (50+50=100 సమానంగా చేసుకోవాలి)

ఆధ్యాత్మిక జీవితాన్ని నా జీవితంలో ఒక భాగంగా చేసుకున్నాను.

 

మా స్నేహితులు అందరికీ ధ్యానంలో చాలా అనుభవాలు వస్తూండేవి. కానీ, నాకు ధ్యానంలో తక్కువ అనుభవాలు వచ్చేవి. నాకు కలిగిన ఒక అపురూపమైన అనుభవం ఏమంటే 2009 లో జరిగిన శ్రీశైలం ధ్యాన యజ్ఞంలో నేను ధ్యానంలో కూర్చుంటే నా శరీరం మీద నీళ్ళ చుక్కలు వర్షం లాగా పడసాగాయి. వర్షం వచ్చిందేమోనని అలాగే ధ్యానం చేసాను. "O.K" అన్నాక కళ్ళు తెరచి చూడగా పైన టెంట్ ఉంది, క్రింద నేలమీద నీళ్ళుకానీ, తడికానీ లేదు, అంటే వర్షం పడలేదు అని తెలుసుకుని నా శరీరం మీద చూస్తే తడి లేదు. కానీ చినుకులు పడ్డ ఫీలింగ్ బాగా తెలుస్తోంది. అప్పుడు ఆలోచించగా, వర్షం లేకపోయినా పై నుండి ఆకాశగంగ రూపంలో నాలోకి విశ్వశక్తి ప్రవహించిందన్న భావన కలిగింది.

 

ధ్యానం ద్వారా నేను పొందిన మరికొన్ని లాభాలు :

 

* ఏ పని చెయ్యాలన్నా (ఇంట్లో, ఆఫీసులో, బజారులో) భయపడకుండా, ధైర్యంగా చేయగల శక్తి నాకు ధ్యానం ద్వారా పుష్కలంగా వచ్చింది.
ఉదా : ఆఫీసులో ఎవరైనా పెద్ద ఆఫీసరు పిలిస్తే చాలా భయంగా, టెన్షన్‌గా వెళ్ళేదాన్ని. కానీ ధ్యాన జీవితంలో ఆఫీసర్‌తో ధైర్యంగా మాట్లాడి వాళ్ళు చెప్పిన ఆఫీస్ పని ఇబ్బంది లేకుండా సునాయాసంగా చేసుకునే ఆత్మస్థైర్యం వచ్చింది.

* ధ్యానంలో మంచి సంకల్పంతో మనం దేనినైనా సాధించగలం అన్న ఆత్మస్థైర్యం, ఆత్మనిబ్బరం వచ్చింది.
* ధ్యానం చేయగా, అహం (నేను,నాది) అన్నది చాలా తగ్గిపోయింది.
* సంసార బంధంలో (పిల్లలు, భర్త) ఉంటూనే ధ్యానం, ధ్యానప్రచారం ఎలా చేయాలో నేర్చుకున్నాను. ఇంతకు ముందు ఇల్లు, పిల్లలు, ఆఫీసు తప్ప వేరే మనుష్యుల గురించి ఆలోచించేదాన్ని కాదు. ఇప్పుడు ధ్యానం ద్వారా అందరి గురించీ ఆలోచించే మనస్తత్వం అలవాటుపడింది.
*ధ్యానం ద్వారా దేవుడికి దగ్గర అవగలమనీ, మనమే దేవుళ్ళు అవగలమనీ అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను.
* కష్టాన్నైనా, సుఖాన్నైనా సమానంగా ఆస్వాదించే శక్తి నాకు ధ్యానం ద్వారా అలవడింది
* మన పిల్లల్ని వేరేవాళ్ళ మీద ఆధారపడేటట్లు పెంచకూడదు. వాళ్ళను స్వతంత్రంగా ఉండేలా ఎలా పెంచాలో ధ్యానం ద్వారా నేర్చుకున్నాను. వాటిని అమలుపరుస్తున్నాను మరి ఆచరిస్తున్నాను.
* పది మందిలో మాట్లాడాలి అన్నా, స్టేజీ మీద మాట్లాడాలి అన్నా .. నాకు భయం, బిడియం ఉండేది. ఇప్పుడు ధ్యానం ద్వారా అది పోగొట్టుకోగలిగాను.


ఇలా చెబుతూపోతే నా జీవితంలో చాలా మార్పులు జరిగాయి. వాటిలో కొన్ని మాత్రమే తెలిపాను.

 

బ్రహ్మర్షి పత్రీజీకి మనస్ఫూర్తిగా నా శతకోటి ప్రణామాలు తెలియ చేసుకుంటున్నాను. పత్రీజీని భూమి మీద నడుస్తున్న దైవంగా భావిస్తున్నాను. కనుక, ఆయన బాటలోనే నడవాలని నిర్ణయించుకుని, " సెక్రెటేరియట్ క్యాంపస్‌లో ఒక పిరమిడ్ కట్టాలి " అన్న దృఢమైన సంకల్పం ఉంది, అది జరిగి తీరుతుందని ఆశిస్తున్నాను.

 

సందేశం : మనమందరం శాకాహారం మాత్రమే తీసుకుందాం. మనమందరం ధ్యానం చేద్దాం. మనమందరం పిరమిడ్స్ నిర్మద్దాం. మన భువిని దివిగా మార్చుకుందాం. ప్రపంచం నలుమూలలా పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ తీసుకువద్దాం.


జయహో ధ్యానం ! జయ జయహో ధ్యానం !

 

 

 

Go to top