" స్వామి వివేకానంద పిరమిడ్ - లుధియానాకు అమూల్య వరం "

 

 

నా పేరు " రచనా గుప్తా "


నేను 2005 సంవత్సరంలో ఆనాపానసతి ధ్యానసాధన మొదలుపెట్టాను.


ధ్యానంలోకి రాకముందు నాకు ఎన్నో నిరుపయోగమైన అలవాట్లు .. సమయాన్ని వృధా చేయటం, TV సీరియల్స్ చూడటం, అమ్మ లక్కల కాలక్షేపపు కబుర్లు చెప్పటం .. వంటివి వుండేవి. " ఒక యోగి ఆత్మకథ ", " హిమాలయ గురువులతో సాంగత్యం " వంటి సరియైన ఆధ్యాత్మిక గ్రంధాలు చదవటం ద్వారా ఇవన్నీ నా నుంచి దూరం అయిపోయాయి.

 

ఆరునెలలపాటు నేను చేసిన చిత్తశుద్ధితో కూడిన గాఢ ధ్యానసాధన నా భౌతిక అనారోగ్యాలన్నింటినీ దూరం చేయటమే కాకుండా .. నాకు ఎనలేని మానసిక ప్రశాంతత మరి " థర్డ్ ఐ " ఆధ్యాత్మిక అనుభవాలను అందించింది. గత జన్మలు చూసుకుంటూ .. నా మనస్సులో చెలరేగే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలను పొందాను !

 

ధ్యానంలో నేను పొందిన ఆనందాన్ని నా స్నేహితులు, కుటుంబం, ఇరుగుపొరుగుతో మరి ప్రపంచం అంతటితో పంచుకోవటం నాకు ఎంతో ఆనందాన్నిస్తుంది. అందుకే " ఆనాపానసతి " ధ్యానం మరి " శాకాహార " జీవనవిధానాలను అన్నిచోట్ల ప్రచారం చేయటం ప్రారంభించాను.

 

ఈ క్రమంలోనే " పంజాబ్ రాష్ట్రంలో ఒక చక్కటి పిరమిడ్ వుండాలి " అని నేను ఎప్పుడూ కోరుకునే దానిని. నా సంకల్పం ఫలించి .. లుధియానాలో సుందరమైన "స్వామి వివేకానంద ధ్యాన పిరమిడ్" నిర్మించబడి దానికి 2014 ఆగస్ట్ 15న ప్రాణప్రతిష్ట జరుపబడింది !

 

పంజాబ్ రాష్ట్రం లోని ఆధ్యాత్మికులకు ఈ మహాద్భుత పిరమిడ్ ఇవ్వటంలో అనన్యకృషి చేసిన " శ్రీ అనిల్ భారతి " గారికి .. నా హృదయపూర్వక కృతజ్ఞతలు !

 

పిరమిడ్‌లో జరిగే కార్యక్రమాల వివరాలు:


ప్రతి బుధవారం " స్పిరిచ్యువల్ రియాలిటీ " వీడియో ఛూపటం ద్వారా క్రొత్త వాళ్ళకు " ఆనాపానసతి ధ్యానం " బోధించి వారి సందేహాలు నివృత్తి చేయటం .. " లీనా భారతి మేడమ్ " ఈ కార్యక్రమలను నిర్వహిస్తున్నారు. ప్రతి మంగళ, శనివారాలలో క్రమం తప్పకుండా ధ్యానసాధనా కార్యక్రమాలు నిర్వహించబడతాయి.

 

ఆదివారాలలో పిల్లలు, యువతీయువకుల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించబడతాయి .. " శ్వేత శర్మ మేడమ్ " ఈ కార్యక్రమలను నిర్వహిస్తున్నారు.

 

ఈ కార్యక్రమాలు ఎంతో స్నేహపూర్వకంగా ఆహ్లాదకరంగా, ఉల్లాసంతో నిర్వహించటం వల్ల ఆదివారం అయినా సరే ఇక్కడకు రావడాన్ని పిల్లలు ఇష్టపడతారు.

 

అనేక పాఠశాలలు, కళాశాలలు, విద్యార్థులు, హాస్పిటల్స్ చెందిన సిబ్బంది, N.G.O లు " ఆనాపానసతి " ధ్యానం నేర్చుకోవటానికి మా కేంద్రాన్ని సందర్శిస్తారు. చెరగని చిరునవ్వుతో, ఆదరణతో " అనిల్ భారతి " గారు పటుకులూ " అనిల్ భారతి " గారు తమ జీవిత సర్వస్వాన్నీ ఈ పిరమిడ్ కు అంకితం చేశారు.

 

నన్ను నేను వ్యక్తీకరించుకుని, సమాజానికి సేవ చేయగలగటంలో నా కుటుంబ సభ్యుల పాత్ర ఎనలేనిది ! ఈ సందర్బంగా నా భర్త ఇతర కుటుంబ సభ్యులకు నా ప్రేమపూర్వక కృతజ్ఞతలు !

Go to top