" పుట్టింటి వారికీ మరి అత్తింటి వారికీ ధ్యానశిక్షణ "

 

 

నా పేరు " కవిత " !


నేను 2009వ సంవత్సరంలో పిరమిడ్ ధ్యానంలోకి ప్రవేశించాను. వెంటనే నా పుట్టింటి వారికీ .. మరి నా అత్తింటి వారికీ .. ధ్యానం నేర్పించాలని సంకల్పించి .. ధ్యానంలో కూర్చునే ఆస్ట్రల్‍గా వాళ్ళందరి దగ్గరకీ వెళ్ళి .. ప్రేమగా ధ్యానం వలన లాభాలను తెలియజేసి వాళ్ళతో ఆస్ట్రల్‌గానే ధ్యానం చేయించాను!

 

నా ప్రయత్నం వృధాపోకుండా వాళ్ళంతా చాలా తక్కువ సమయంలోనే భౌతికంగా కూడా ధ్యాన మార్గంలోకి వచ్చేసారు.

 

ఈ క్రమంలోనే నేను మా స్వంత గ్రామం అయిన కర్నూలు జిల్లా " పగిడ్యాల " లో భౌతికంగానే 41 రోజులు ధ్యానకార్యక్రమం నిర్వహించాలని సంకల్పించాను.
మా ఇంట్లో వాళ్ళకు నేను బయటికి వెళ్ళడం ఇష్టం లేకపోవడంతో ఇక ఫోన్ ద్వారానే రోజుకొక మాస్టర్‌ని ఆహ్వానిస్తూ .. " కర్నూలు రామ్మోహన్ రావు " గారి సహకారంతో గ్రామంలో ధ్యానకరపత్రాల పంపిణీ మరి ధ్యానశిక్షణ నిర్వహించాను. వారికి నా కృతజ్ఞతలు !

 

చివరిరోజు నంద్యాల " వైదేహి మేడమ్ " గారి సహకరంతో "మా ఊళ్ళో అహింసా-శాకాహార ర్యాలీని నిర్వహించాలి" అని నిర్ణయించుకున్నాం.

 

ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశాం కానీ నన్ను ఆ కార్యక్రమానికి పంపడానికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. " ఇన్ని మనస్పర్థల మధ్య నేను బయటికి వెళ్ళడం అవసరమా ? " అని మొదట నేను సంకోచించాను. కానీ మా గ్రామస్థులు " నువ్వు కూడా రావాలి " అని గట్టిగా పట్టుపట్టడంతో " నిర్భయంగా ఉండడమే ఆత్మ యొక్క లక్షణం మరి .. మంచి పని చెయ్యడానికి భయం ఎందుకు ? " అనుకుంటూ ధైర్యంగా ఒక్కదాన్నే కర్నూలుకు బయలుదేరాను.

 

ఆ రోజు పెద్ద వర్షం ! వర్షంలోనే కర్నూలు చేరుకుని అప్పటికే అక్కడ నా కోసం ఎదురుచూస్తూన్న మా తమ్ముడితో కలిసి " పగిడ్యాల " గ్రామం చేరుకున్నాను. ఆ రోజు క్లాసులో అందరితో ధ్యానం చేయించి " ఒక స్త్రీకి ధ్యాన జీవితంలో వచ్చే అడ్డంకులు ఏమిటి ? ఆత్మశక్తితో వాటిని ఎలా అధిగమించాలి ? " అంటూ నా స్వీయానుభవాలనే వారితో పంచుకున్నాను.

 

మర్నాడు జరిగిన గొప్ప " శాకాహార ర్యాలీ " లో నేను గ్రామస్థులతో, స్కూలు పిల్లలతో మరి పిరమిడ్ మాస్టర్లతో కలిసి పాల్గొని .. " శాకాహార ప్రాముఖ్యత " ను తెలిపే స్లోగన్స్ ఇస్తూ, ప్లకార్డులను మోస్తూ, పాంప్లెట్స్ పంచుతూ ఉత్సాహంగా గ్రామంలోని గడపగడపకూ తిరిగాను. విజయవంతంగా ర్యాలీని ముగించి .. గ్రామస్థుల అభినందనలు అందుకుని .. ఇంటికి చేరాను.

 

ఒక " స్త్రీ " గా అనేకానేక కట్టుబాట్ల పరిధులలో ఉండి కూడా నా సంకల్పం మేరకు ధైర్యంగా ఇంట్లో నుంచే ధ్యానప్రచారం చేసి జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కిన నా ధ్యానశక్తితో .. ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు కూడా ధ్యానులుగా మరి శాకాహారులుగా మారిపోయారు ! ఇన్నాళ్ళుగా మా ఇంట్లో ఉన్న అపార్థాలూ, నిష్ఠూరాలూ అన్నీ తొలగిపోయి .. ఇప్పుడు నా ఆత్మ ఎదుగుదలకు చక్కటి రాజమార్గం ఏర్పడింది !

 

అంతే కాదు .. మరి ఎన్నాళ్ళుగానో తీవ్రమైన అల్లర్జీ వల్ల నల్లబడిపోయిన నా ముఖం, మెడ, చేతులు అన్నీ కూడా ఇప్పుడు రంగు మారి తెల్లబడిపోయి ! ఇలా నేను చేస్తోన్న మంచి పనులకు సహకరిస్తూన్న నా పుట్టింటి వారికీ .. మరి నా అత్తింటి వారికీ .. ఆత్మపూర్వక ధన్యవాదాలు !

 

కవిత

బేతంచర్ల

కర్నూలు జిల్లా

9059609596

Go to top