" ధ్యానమే నన్ను కాపాడింది "

 


నా పేరు " మునిరెడ్డి " !

 


నా వయస్సు 76 సంవత్సరాలు. నేను 2010, జనవరి 10వ తేదీన నా తమ్ముని కుమారుడు " M. పరంధామరెడ్డి " ద్వారా ధ్యానం గురించి తెలుసుకున్నాను.


అప్పటికే నేను క్షయవ్యాధితో బాధపడుతూ తమిళనాడు లోని C.M.C. వెల్లూరు హాస్పిటల్ లో క్రమం తప్పకుండా వైద్యం చేయించుకుంటున్నాను. ప్రతిరోజూ ఉదయం ఏడు, సాయంత్రం ఏడు రకాల చొప్పున 14 రకాల మాత్రలను మింగేవాడిని. రాత్రిపూట ఆక్సిజన్ మిషన్ పెట్టుకునే పడుకోవాల్సి వచ్చేది.

 

అటువంటి సమయంలో మా " పరంధామరెడ్డి " నాకు ధ్యానం గురించి చెప్పినప్పుడు నేను " ఇన్ని మాత్రలు వాడితే కూడా నయంకాని జబ్బు .. డాక్టర్లూ మరి ఆసుపత్రులూ లేకుండానే కేవలం ముక్కులోని గాలిని గమనిస్తే ఎలా పోతుంది?" అనుకున్నాను, వెళ్ళి పోయాను, అయితే .. ఇంటికి వెళ్ళాక కూడా మా అబ్బాయి మాటలే ఆలోచించసాగాను.

 

" సరే ! నమ్మి చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ! " అనుకుని మాంసాహారం మానివేసి 90 రోజులపాటు ‘ధ్యానం’ చేశాను. ఆశ్చర్యకరంగా నా ఆరోగ్యం కుదుటపడడం మొదలయ్యింది ! డాక్టర్లు కూడా పరీక్షచేసి చూడగా రిపోర్టులు ‘ నార్మల్ ’ గా వచ్చాయి !

 

నన్ను చూసి నా బంధువులు, స్నేహితులు కూడా ధ్యానం చెయ్యడం మొదలుపెట్టారు !


నన్ను ఆరోగ్యవంతుడిగా చూసిన నా కుమారుడు తాను కూడా ధ్యానం ద్వారా సంపూర్ణ అరోగ్యవంతుడిగా మారి ఇప్పుడు " రేణిగుంట " చుట్టుప్రక్కల గ్రామాలలో ధ్యానప్రచారం చేస్తున్నాడు ! ధ్యానప్రచార రథంతో ద్వారా ర్యాలీలు నిర్వహిస్తున్నాడు !

 

రేణిగుంట చుట్టుప్రక్కల గ్రామాలలో తొమ్మిది పిరమిడ్‌లను నిర్మించి ‘ ధ్యానం ’ ద్వారా చక్కటి ఆరోగ్యాన్ని పొందిన వారందరినీ బస్సులలో తీసుకుని ప్రతి యేటా బుద్ధపౌర్ణమికి బెంగళూరు కు మరి ధ్యానమహా చక్రాలకు కైలాసపురి కడ్తాల్ కు వస్తున్నాము.

 

ఈ క్రమంలో ఆగస్ట్ 22వ తేదీ పత్రీజీ తిరుపతి " త్యాగరాయ మండపం " లో నిర్వహించిన కార్యక్రమానికి అందరం కలిసి వెళ్ళాము. దూరంగా ఉన్న నన్ను దగ్గరగా పిలిచి .. నా భుజం మీద చెయ్యివేసి " ఏంటి సంగతి ? " అని అడిగారు.

 

" మీకు తెలియనివి నా దగ్గర ఏం ఉన్నాయి సార్? అన్నాను ! ఆ తరువాత కొద్ది రోజులకే నా కుడికాలు చెయ్యి పనిచెయ్యడం మానివేశాయి. రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు కారణం ఏమిటో చెప్పకపోవడంతో నేను పిరమిడ్ లో కూర్చుని దీక్షగా ‘ ధ్యానసాధన ’ చెయ్యడం మొదలుపెట్టాను.

 

కేవలం రెండు నెలలలోనే ఏ మందూ మాకూ వాడకుండానే నా కాలు, చెయ్యి స్వాధీనంలోకి వచ్చి .. మునుపటిలాగే ధ్యానప్రచారానికి వెళ్ళగలుగుతున్నాను ! నేను నన్ను చూసిన వాళ్ళంతా కూడా " నీ ధ్యానమే నిన్ను కాపడింది" అంటున్నారు ! పత్రీజీకి కృతజ్ఞతలు !

 


M.మునిరెడ్డి

రేణిగుంట

చిత్తూరు జిల్లా
93940 15253

Go to top