" దివ్య ధ్యాన విద్య "

 

నా పేరు " కొండారెడ్డి ". నేను " ఉస్మానియా యూనివర్సిటీ " నుంచి M.Sc " బయోటెక్నాలజీ " చేసి ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నాను. నేను ఇంటర్మీడియట్ చదివే రోజులలోనే D.శివప్రసాద్‌గారి "ధ్యానలహరి" మ్యాగజైన్ ద్వారా ధ్యాన పరిచయాన్ని పొందడం జరిగింది. ధ్యానం వలన మానసిక ఒత్తిడి తగ్గడంతో పాటు ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలుసుకున్నాను.

 

PSSM ప్రచురించే అద్భుతమైన ఆత్మజ్ఞాన గ్రంధాలను చదువుతూ .. " ధ్యాన సాధన " ను మరింత పెంచుకుంటూ నా జీవితాన్ని ఆధ్యాత్మిక మయం చేసుకున్నాను. నాకు తెలిసిన ధ్యానాన్ని అందరికీ నేర్పించాలని నా పరిధిలోనే చిన్న చిన్న మెడిటేషన్ క్లాసులను నిర్వహిస్తూ హైదరాబాద్ బాగ్ అంబర్‌పేట" షిరిడీ సాయిబాబా గుడి "లో క్రమం తప్పకుండా ప్రతి గురువారం మూడున్నర సంవత్సరాల పాటు ధ్యానశిక్షణా తరగతులను నిర్వహించాను.

 

ఈ కార్యక్రమాల వల్ల కొన్నివేలమంది భక్తులుగా గుడికి వచ్చి .. ధ్యానులుగా మరి శాకాహారులుగా మారారు. వారిలో ఎంతో మంది విద్యార్థులు మరి యువకులు PYMA లో చేరి తమవంతు ధ్యానప్రచార సేవను నిర్వహిస్తున్నారు.

 

ఈ క్రమంలో నేను " స్కైప్ " ద్వారా దేశవిదేశాల పిరమిడ్ మాస్టర్ల సహకారంతో అంతర్జాలంలో ధ్యానశిక్షణా తరగతులను నిర్వహిస్తూ గద్వాల్ కేంద్రంగా " సుభాష్ పిరమిడ్ ధ్యానకేంద్రం " ను స్థాపించడం జరిగింది.

 

ఉపాధ్యాయవృత్తిలో ఉన్న నాకు విద్యార్థులపై ధ్యానం ఎంత మంచి ప్రభావాన్ని చూపిస్తుందో స్పష్టంగా అర్థంకావడంతో నా స్నేహితులతో కలిసి ఒక "టీమ్"లా ఏర్పడి " దివ్యవిద్య " ప్రాజెక్ట్ ద్వారా మారుమూల గ్రామాలలోని పాఠశాలలకు కూడా "ధ్యాన విద్య"ను అందిస్తున్నాను.

 

చక్కటి ప్రణాళిక ద్వారా ఈ ప్రాజెక్ట్‌ను అమలుపరుస్తూ సంబంధత జిల్లాల అధికారుల అనుమతితో వందకుపైగా స్కూళ్ళలో వేలాది మంది పిల్లలకు ధ్యానవిద్యను అందించడం జరిగింది. విద్యార్థులతో పాటు టీచర్స్ కూడా తమ తమ సమయాలను కేటాయిస్తూ ఇందులో పాల్గొంటున్నారు. పత్రీజీ అందించిన " శ్వాస విజ్ఞాన జ్యోతి - విద్యార్థి జీవన క్రాంతి " అన్న ఆడియోను ఈ తరగతులలో పిల్లలకూ మరి టీచర్లకూ వినిపిస్తున్నాము.

 

చిన్నవయస్సులోనే విద్యార్థులకు " ధ్యానవిద్య " ను అందించడం వలన వారంతా అనేకరకాల భయాలనుంచీ మరి ఆత్మన్యూనతాభావం నుంచీ విముక్తిచెంది .. భవిష్యత్తులో చక్కటి ఆత్మజ్ఞాన పరాయణులుగా ఆత్మ విశ్వాసంతో జీవిస్తూ అద్భుతమైన సమాజాన్ని నిర్మించగలుగుతాము. ఈ " ధ్యానవిద్య " ప్రాజెక్ట్‌లో భాగం పంచుకోదలచిన పిరమిడ్ మాస్ట్‌ర్స్‌ను సంప్రదించండి.

 

 


N. కొండారెడ్డి

గద్వాల్ జోగులాంబ జిల్లా
తెలంగాణ

9948164206

Go to top