"సోమసముద్రం కాదు, ధ్యాన సముద్రం ఇది"

 

నా పేరు "గణేశ్"! నా జీవితంలో "సంసారం వద్దు" అనుకుని వైరాగ్య జీవనం అవలంబించాను. నేను 2005లో యోగ, ప్రాణాయామం, తపస్సు అని ధ్యానాన్ని చేసేవాడిని. నేను ధ్యానం చేసే పొలంలో ప్రతిరోజూ సూర్యదేవుడిని ప్రార్థించుకుని మా ప్రజలు ధ్యానం అనే అమృత రసాన్ని ఆస్వాదించాలని చెప్పుకుని చేసేవాడిని. ఒక నెల అయిన తరువాత బళ్ళారి నుంచి శ్రీ సూర్యనారాయణ, శ్రీమతి రేణుకమ్మ, శ్రీ పంపారెడ్డి గార్ల ద్వారా శ్రీమతి గౌరమ్మ, శ్రీమతి పార్వతి, శ్రీమతి శాంతి గార్ల వీధిలో 41 రోజులు మండల ధ్యానం చేసారు. మూడు సం||లు మండల ధ్యానాన్ని విడువకుండా చేస్తూ వచ్చారు. ఒకసారి "కాశీనగరం"లో రామలక్ష్మమ్మ ఇంట్లో 41 రోజుల మండల ధ్యానంను ప్రారంభించారు. మా ఊరిలో ధ్యానులు పెరగడం వలన పిరమిడ్ కట్టాలని నా స్నేహితుడైన "హొన్నూరు స్వామి ఆనందరాజు" మరి మా గ్రామ పెద్దలు నిర్ణయించుకున్నాం. నాకు నా యొక్క జీవనంలో అందరికీ జ్ఞాన మార్గాన్ని తెలియజేయాలని ఆశ.

మా ఊరిలో 9వ శతాబ్ధిలో నిర్మించబడిన "శ్రీ కాశీవిశ్వనాధ దేవస్థానం" ఉంది. అక్కడ నేను 21 రోజుల శివదీక్ష వ్రతాన్ని ఆచరించేవాడిని. ఒకరోజు శివుని పూజ ధ్యానస్థితిలో ఉన్నప్పుడు "శ్రీ కాశీవిశ్వనాధ దేవస్థాన వెనుక భాగాన పిరమిడ్ నిర్మాణం అవుతుంది, ఆ స్థలంలో జ్ఞానం దొరుకుతుంది" అని నాకు తెలిసింది. అప్పుడు అక్కడున్న యువకులకు శివునికి ఎంతో శక్తి ఉన్నదని నేను తెలిపాను. మరి అక్కడ యువకులైన మంజునాథ, దశరథరెడ్డి, శరణప్ప, లింగప్ప, మౌడ్లెప్ప, పంపాపతి, మల్లికార్జున, మనోజ్, హొన్నూరు స్వామి మరి ఇతరులు చేరారు. ప్రతిరోజూ యువకులను "ఈ జన్మలో ఏమైనా సాధించాలి" అని తెలియజేసాను. యువకులు అందరూ చేరి దేవస్థానం చుట్టూరా తెల్లవారు ఝామున 4.00 గం||లకు శుభ్రపరుస్తూ వచ్చారు.

బళ్ళారి భీమాయాదవ్ సార్ గారు పిరమిడ్ కట్టటానికి మార్క్ చేసారు. యువకులు ప్రొద్దున్న వారి వారి సొంత పనులను చేసుకుని రాత్రి 9.00 గం||ల నుంచి తెల్లవారు ఝామున 3.00 గంటల వరకు మన పిరమిడ్ పనులను ఉచితంగా చేసేవారు. ప్రతిరోజూ రాత్రులలో మన పిరమిడ్ కట్టాం. శ్రీ భీమా యాదవ్ సార్ గారు, శ్రీమతి రేణుకమ్మ, శ్రీమతి గౌరమ్మ, శ్రీమతి గంగమ్మ, రామప్ప, శాంతి పరమేశ్వరప్ప, సిద్ధరామయ్య స్వామి, శ్రీ హనుమంత మరి శ్రీ తిప్పయ్య మాకు అన్ని విధాలా వారి వంతు సహాయాన్ని అందచేశారు. ఇంతేకాక "కాశీనగరం"లో చిన్నపిల్లలు, ధ్యాన మాస్టర్లు, ఆడబిడ్డలు కూడా మాతో కలిసి పనిచేసారు. 20’*20’ అడుగుల పిరమిడ్ కట్టటానికి రు.4,00,000/- కావలసి ఉంది. అయితే అక్కడ ప్రజలు, మాస్టర్లు మాతో కలిసి ఉచితంగా సేవను అందించటం వలన మన పిరమిడ్ కట్టటానికి ఖర్చు 1,50,000 రూపాయల ఖర్చుతో పూర్తి అయింది.

17-01-2017 తేదీన పరమ పూజ్యులైన "బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీ" గారు మన పిరమిడ్ ప్రారంభించారు! ఉదయం 8.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు శ్రీయుతులు రుద్రయ్య చౌదరి స్వామి, మస్కి మల్లికార్జున స్వామి, K.రామకృష్ణగారు వీరి ఆధ్వర్యంలో మా గ్రామ ప్రజలందరూ కలిసి గ్రామంలో శాకాహార ర్యాలీని నిర్వహించాము. మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు అయిన తరువాత సాయంకాలం 4.00 గం||ల నుంచి 6.00గం||ల వరకు పత్రీజీ స్వామి వారి అమృతహస్తాలతో పిరమిడ్ ప్రారంభోత్సవం జరిగింది; ధ్యానం మరి సత్సంగం జరిగింది. "శ్రీ కాశీవిశ్వనాధ పిరమిడ్ ధ్యాన కేంద్రం" అని పేరును పెట్టారు. "సోమ సముద్రం కాదు, ఇది ధ్యాన సముద్రం" అని తెలిపారు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. పిరమిడ్ ప్రారంభోత్సవానికి ఒక నెల ముందు నుంచి మా గ్రామంలో సుంకలమ్మ జాతర చేయాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. అప్పటి నుంచి మాలో తెలియని పట్టుదల మొదలైంది. మా గ్రామంలో జాతర జరుగకూడదని నిర్ణయించుకున్నాం.

ఒక పౌర్ణమి రాత్రి "శ్రీ రుద్రయ్య చౌదరిస్వామి" మరి హంగినడోని పీఠాధిపతి "శ్రీశ్రీశ్రీ సిద్ధలింగ శివాచార్య స్వామీజీ"లు వచ్చి జీవహింస గురించి గ్రామ పెద్దలకు తెలియపరిచారు. "ప్రతిరోజూ తెల్లవారుఝామున ధ్యానంలో మా గ్రామం అంతా శాకాహార గ్రామంగా మారింది" అని సంకల్పం చేయమని తెలియపరిచారు. అదేవిధంగా మేము సంకల్ప చేశాం. జాతర చేయవలసిన రోజు జంతు హింస జరుగలేదు! పాయసంతో పూజచేసి గ్రామ పెద్దలు పూజా కార్యక్రమాలను ముగించారు. పిరమిడ్ యొక్క శక్తి, ధ్యానం యొక్క శక్తి, శాకాహారం యొక్క శక్తి, పత్రీజీ స్వామి శక్తి .. మరి మన అందరి శక్తి పనిచేసినందుకు మాకు చాలా సంతోషమైంది! ప్రతిరోజూ ధ్యానంను "సోమసముద్రం" గ్రామంలో ఉండే ఆడవాళ్ళు, పిల్లలు మరి అందరూ ప్రొద్దున్న 4.00 గంటలకు ధ్యానం చేయటానికి వస్తున్నారు. శ్రీ సిద్ధరామ స్వామి, శ్రీ ఆనందరాజ స్వామి, శ్రీ హనుమంత, శ్రీ తిప్పయ్య వీరందరూ కూడా పిరమిడ్ కట్టడానికి అధిక సహాయం అందించారు. రాత్రి 7.00 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు ప్రతిరోజూ 100 మంది ధ్యానం చేయటానికి వస్తున్నారు. వీరికి బళ్ళారి నుంచి శ్రీ హంపణ్ణ సార్, శ్రీ పంపయ్య స్వామి, శ్రీమతి గీత మేడమ్ శ్రీ సత్యవతి మేడమ్ అందరూ ధ్యానం మరి సత్సంగాలను నిర్వహిస్తున్నారు. మా వీధి ప్రక్కనున్న "హరిజనవాడ" లో ప్రతిరోజూ రాత్రి 7.00 గం||ల నుంచి రాత్రి 9.00 వరకు 50 మంది ధ్యానం చేస్తున్నారు.

 

గణేశ్

- సోమసముద్రం - బళ్ళారి - కర్ణాటక రాష్ట్రం

Go to top