"మధుర అనుభవాలను అందించిన మధురమామిడి క్లాసు"

 

నా పేరు శ్రీనివాసరావు. నేను ధ్యానంలోకి రాకముందు ఇంటి దగ్గర, ఇంటి చుట్టుప్రక్కల దేవాలయలలో పండుగలు జరుపుకునేవాళ్ళం. ధ్యానంలోకి వచ్చిన తరువాత పిరమిడ్‌ల దగ్గర, యోగుల సమక్షంలో, కలియుగ దైవం బ్రహ్మర్షి పత్రీజీ ఆధ్వర్యంలో పండుగలు జరుపుకుంటున్నాము! ఈ క్రమంలో నేను 2016 నవంబర్‌లో దీపావళి పండుగ మన మహేశ్వర పిరమిడ్, కడ్తాల్‌లో ‘పత్రీజీ’ సమక్షంలో కుటుంబ సమేతంగా జరుపుకున్నాము. ఆ తరువాత వచ్చిన పండుగ సంక్రాంతి. మూడు రోజులపాటు కొటాలలో (జేతవనం) పత్రీజీ సమక్షంలో అనేకమంది యోగుల మధ్య జరుపుకున్నాము. ఈ మధ్య వచ్చిన ఉగాది పండుగ "V. మాడుగుల"లో వీర జగదీశ్వరిగారి పిరమిడ్ ప్రాంగణంలో జగద్గురు పత్రీజీ గారి సమక్షంలో అద్భుతంగా జరుపుకున్నాము. "V. మాడుగుల" నుంచి బయలుదేరి పాకలపాడు ఆశ్రమానికి "భీమ్‌సింగి" చేరుకున్నాము. ఆశ్రమ నిర్వాహాకులు మన్య ప్రాంతంలో క్లాస్ ఏర్పాటు చేస్తామన్నారు. నేను "ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చి ధ్యానం క్లాస్ చెబుతాను" అన్నాను. "సరే సార్" అన్నారు. తరువాత వాళ్ళు ఏప్రిల్ 12వ తేదీ నాడు క్లాసు ఏర్పాటు చేశారు.

"మధుర మామిడి" అనే గ్రామంలో "శ్రీ శ్రీ శ్రీ గగనానంద స్వామి" వారి జన్మదిన వేడుకల సందర్భంగా మూడు రోజుల కార్యక్రమంలో 12వ తేదీ ఆఖరు రోజున నేను క్లాస్ చెప్పటం జరిగింది. ఆ ధ్యానం క్లాస్‌లో పాల్గొన్న వారందరూ కూడా ‘శ్రీ గగనానంద స్వామి’ వారి ప్రేరణతో గత మూడు తరాలుగా శుద్ధ శాకాహారులుగా ఉన్నారు! మన పిరమిడ్ మాస్టర్ల ప్రేరణతో ధ్యానయోగులుగా, అద్భుతంగా ధ్యానం చేస్తూ జీవిస్తున్నారు. అటువంటి వారి సమక్షంలో ధ్యానం క్లాస్ చెప్పే భాగ్యం కలిగింది. ఆ ధ్యానం క్లాస్‌కి సుమారు 500 మంది ధ్యానులు పాల్గొన్నారు. నాతో పాటు ఈ ఆనందాన్ని పంచుకోవటం కోసం సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయిన అనిల్ కుమార్‌గారు, విజయలక్ష్మిగారు "నాగార్జున సాగర్"నుంచి వచ్చారు. "హాలియా" మాస్టర్ సైదయ్యగారు, సామర్లకోట ప్రసాద్‍గారు అందరం కలిసి వెళ్ళి అద్భుతంగా ధ్యాన ప్రచారం చేసి ఎంతో ఆనందాన్ని పొందాము.

శ్రీనివాసరావు

 ఏలూరు - పశ్చిమగోదావరి జిల్లా

- 9490790262.

Go to top