"పిరమిడ్ జేతవనం - ఒక అద్భుత శక్తిక్షేత్రం"

 

నా పేరు "శివశంకర్"! నేను హైదరాబాద్‌లో ఉంటాను. నేను 2000 సం|| నుంచి ధ్యానం మార్గంలో ఉన్నాను. మాది ధ్యాన కుటుంబం. చిత్తూరు జిల్లా "కొటాల"లో జరిగిన సంక్రాంతి సంబరాలకు మా అన్నగారు హాజరై .. అక్కడి విశేషాలనూ .. అనుభూతులనూ .. విశేషంగా .. ఎప్పుడూ చెబుతూండేవాడు. మా అన్నగారి మనుమరాలు "చి|| లక్ష్మి మైత్రి" యొక్క రెండవ పుట్టినరోజు పండుగను మే 1వ తేదీన కొటాలలో నిర్వహించాలని భావించి మా కుటుంబీకులం అందరం కలిసి కొటాల కు చేరుకున్నాము. అక్కడికి వెళ్ళగానే కొటాల సోదరులు "సుధాకర్", "ప్రభాకర్" మరి వారి కుటుంబీకులు మాకు ఆత్మీయ ఆహ్వానం పలికారు. వారి ఆత్మీయతకు మా మనస్సులు పులకరించాయి.

మరునాడు ఉదయం మేమందరం కొండపైన ఉన్న "శివ పిరమిడ్"కు వెళ్ళాం. అప్పటివరకు ఎంతో వేడిగా, ఉక్కపోతుగా ఉన్న వాతావరణం మబ్బులతో నిండి ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. మేము అందరం ధ్యానం చేస్తూండగా ఉరుములు, మెరుపులు, చల్లని గాలులతో చిరుజల్లులు పడి ఆ కొండ ప్రదేశమంతా ఎంతో ఆహ్లాదకరంగా మారిపోయింది.

మరుసటి ఉదయం అల్పాహారం తర్వాత నేను అక్కడ ఉన్న చింతచెట్టు క్రింద ధ్యానం చేస్తూండగా ఎనర్జీ ప్రవాహం వల్ల నా గొంతులో చల్లగా అయినట్టు అనుభూతి కలిగింది. అక్కడి చింతచెట్లు చాలా పెద్దవిగా, ఎన్నో సంవత్సరాలుగా, ఎంతో శక్తివంతంగా ఉన్నాయి. ఆ ప్రదేశమంతా శక్తిమయమైనట్లు అనుభూతి కలిగింది. అక్కడ ప్రతి కట్టడం పైన పిరమిడ్లే. మొత్తం మీద 56 పిరమిడ్లు ఉన్నట్లు చెప్పారు. ఇప్పుడు క్రొత్తగా హీలింగ్ పిరమిడ్ మరి భోజనశాల నిర్మాణాలు పూర్తి కాబోతున్నాయి.

ఉదయం 11.00 గం||లకు సుమారు 40 మంది ధ్యానులతో కలిసి ముందుగా ధ్యానం చేసి, తదుపరి కొటాల సోదరుల అధ్వర్యంలో ధ్యానాత్మ బంధువుల మధ్య "చి|| లక్ష్మీ మైత్రి" 2వ జన్మదిన వేడుకలను ఆనందకరంగా జరుపుకున్నాం. ప్రపంచానంతటికీ ధ్యానం, జ్ఞానం, అహింస గురించి బోధిస్తున్న అలుపెరగని విశ్వగురువు "బ్రహ్మర్షి పత్రి" సార్ హృదయపూర్వక కృతజ్ఞతలు!

 

శివశంకర్

హైదరాబాద్
-98494 64510.

Go to top