"పత్రీజీ అంతరంగిక కార్యదర్శి"

 

"పత్రీజీ"అంతరంగిక కార్యదర్శి "శ్రీ దువ్వూరు శివప్రసాద్" 1967 జూన్ 25వ తేదీన తూర్పుగోదావరి జిల్లా, ముమ్మిడివరం మండలం, కొత్తలంక గ్రామంలో జన్మించారు. వారి తండ్రి "శ్రీ వేంకటేశ్వర శర్మ", తల్లి "శ్రీమతి సీతామహలక్ష్మి", "శ్రీ శివప్రసాద్" గారు అర్ధశాస్త్రంలో గ్రాడ్యుయేషన్, కంప్యూటర్స్‌లో డిప్లోమో ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.

1995లో అనంతపురం పట్టణంలో "ఉదయం" వార్తాపత్రికలో ఉద్యోగం చేస్తూండగా ఆగస్ట్ 18, 1995న ఒక మిత్రుడు, మరి పిరమిడ్ మాస్టర్ అయిన శ్రీ శాస్త్రి గారి నుంచి "ధ్యానం చేస్తే దైవమే మన వద్దకు వస్తారు" అన్న మాటతో స్ఫూర్తిచెంది శివప్రసాద్ గారు ధ్యానం చెయ్యడం మొదలుపెట్టారు. దైవం పట్ల మక్కువతో ధ్యానం చేస్తూ .. అదేరోజు ధ్యానంలో 7 గం||ల తరువాత అజ్ఞాచక్రస్థానంలో ఒక వెలుగు, శివలింగం, నందీశ్వరుడు, పర్వతగిరులు, ఆకాశగంగ, ధ్వజస్తంభం దర్శించారు. రాత్రి నిద్రపోయిన తరువాత తెల్లవార్లూ ఎవరో వచ్చి లేపుతూన్న భావన.

మరుసటి రోజు ధ్యానం చేస్తూండగా ఒక ఋషి వెనుకకు తిరిగి కన్పించారు. "ఆయన దగ్గరకు వెళ్ళి చూద్దాం" అనుకుంటూ శివప్రసాద్‌గారిలో నుంచి ఒక నీడ బయటకు రావడం కన్పించింది. అప్పుడు ఆ ఋషి వెనుక ప్రక్కకు తిరిగారు. ఆయనను వెంబడించగా పైకి ఊర్ధ్వముఖంగా అదృశ్యమయ్యారు. ఇది రెండవ అనుభవం.

ఒక పర్ణశాలను చూసి, లోనికి వెళ్ళే ప్రయత్నం చేయగా "నిన్ను ఇక్కడకు ఎవరు రమ్మన్నారు?" అని గద్దించగా శివప్రసాద్ బయటకు వెళ్ళబోగా ఒక స్త్రీ "ఆయన అలా మాట్లాడుతారు కానీ కఠినులు కాదు, వెళ్ళకు" అని చెప్పింది ఆయన స్వామీ రామా! ఆ తరువాత ఉద్యోగం మీద ఆసక్తి పోయింది. ఆ తరువాత పత్రీజీని కలిసి ఆయనతో ఉండిపోయారు. తిరుపతి కేంద్రంగా ఉంటూ పత్రిగారు తిరుపతి వచ్చినప్పుడల్లా వారి ఆడియో క్యాసెట్‌లు రికార్డ్ చేయటం, "ధ్యాన", "ధ్యానలహరి", పత్రికలు ప్రచురించడం, "ధ్యానలహరి ఫౌండేషన్" పేరుతో చిన్న పుస్తకాలు ముద్రించడం చేసేవారు. దానితోపాటు పత్రీజీతో కలిసి వివిధ ప్రాంతాలకు తిరుగుతూ .. PSSM యొక్క విశేష వ్యాప్తికి దోహదం చేస్తూ .. ప్రస్తుత PSSM మహోధ్యమంలో శివప్రసాద్ గారు అత్యంత ప్రముఖపాత్ర పోషిస్తున్నారు.


దువ్వూరు శివప్రసాద్

-9440274559.

Go to top