" ‘నేను’ అనే స్థితి నుంచి ‘అంతా నేను’ అనే స్థితికి"

 

నా పేరు "మల్లేశ్వరి"! 2008 ఫిబ్రవరి తెనాలిలో జరిగిన ధ్యాన సప్తాహం ఏడు రోజుల ప్రోగ్రామ్ గురించి ముద్రించిన ఒక చిన్న పాంప్లెట్ నేను చూశాను. దాని ద్వారా ఆరవ రోజు నుంచి ధ్యానం క్లాస్కి వెళ్ళడం మొదలుపెట్టాను. ముందు ధ్యానం అన్నది అస్సలు నమ్మలేదు. అయితే "వినడం వల్ల నష్టం ఏమీ లేదు కదా!" అనుకొని క్లాస్లు విన్నాను. ఆ తరువాత "ధ్యానం చాలా బాగుంటుంది" అని అర్థమైంది; ధ్యానానికి కూర్చోడానికి ప్రయత్నించాను.

వారం రోజుల తర్వాత నాకు దైవదర్శనం జరగడం, మాస్టర్లు నాతో మాట్లాడటం, నేను ఎప్పుడూ చూడని ప్రదేశాలకు వెళ్ళడం .. కళ్ళు మూసుకుంటే ఎన్నెన్నో అనుభవాలు! కొన్ని రోజులకు నేను ఏమిటో అర్థమైంది. "ఎందుకు ఈ అనుభవాలు?" అనుకున్నాను. తరువాత నాకు సూక్ష్మశరీరయానం జరిగింది. నా శరీరం లోపలే 3,4 రోజులు ప్రయాణం జరిగింది. తరువాత నా నుదుటిమీద దృష్టి నా ప్రమేయం లేకుండా నిలిచింది. రెండు సంవత్సరాలు ప్రతిరోజూ 7,8 గంటలు తీవ్రంగా పిరమిడ్లో ధ్యానం చేసిన తరువాత "నేను ఒక మాస్టర్గా తయారయ్యాను" అని అర్థమైంది. అప్పటినుంచి నేను తెనాలిలో ధ్యానప్రచారం ఉధృతంగా మొదలుపెట్టాను.

స్కూల్స్‌కి, హాస్టల్స్‌కు, కేర్ సెంటర్లకూ వెళ్ళి అక్కడ వాళ్ళకు క్లాస్లు చెప్పడం, నేను తెనాలిలో నేర్చుకున్న ఆధ్యాత్మికత అంతా ఒక తెనాలి క్లాస్ లో వివరించి .. నేను 2010 మే నెలలో గుంటూరుకి వచ్చాను. "అమరావతి ధ్యానమహాచక్రనాకి" గుంటూరులో దేవాలయాలలో ధ్యానం క్లాస్ పెట్టడం, ధ్యానం చేసేవారిని మాస్టర్స్గా క్లాస్లకు పంపించడం, ధ్యానం తెలియని వారిని "అమరావతి ధ్యానమహాచక్రానికి" అన్నదానంలో భాగస్వాములుగా చేయడం వంటి వాటితో నేను బాగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నాను. భౌతిక విషయాలలో బాధపడిన మనస్సుకు "ఆధ్యాత్మికతలో మనశ్శాంతి లభిస్తుంది" అనుకున్న నేను ఆధ్యాత్మికతలో ఒడిదుడుకులు ఎదుర్కోవటంతో 2011 ఫిబ్రవరి నెలలో పూర్తి మౌనంలోకి వెళ్ళాను.

2012 జూన్‌లో మౌనం నుంచి బయటికి వచ్చి గుంటూరు జిల్లా "ధ్యాన మహిళా విజృంభణ" అనే పాంప్లెట్ పత్రీసార్ చేతుల మీదుగా ప్రారంభించాను. "విజృంభణ" అనే వాక్యం గుంటూరు జిల్లాలో సేవచేయటానికి "ఆస్ట్రల్"గా చాలా ఉపయోగపడింది.

2013లో మళ్ళీ మౌనం. నా యొక్క సంకల్పంతో 2014 పిరమిడ్ పార్టీలో ప్రచారంచేసి పిరమిడ్ పార్టీ చాలా బాగుందని తెలుసుకున్నాను. కడ్తాల్లో జరిగే ధ్యాన మహాచక్రానికి "జోలె" కార్యక్రమం చేశాను. 2015లో మళ్ళీ మౌనం. నాతో నేను ఉన్నాను. 2016లో శాకాహార ర్యాలీలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడం, గుంటూరు, మెయిన్ బజార్లో భారీగా అయిదు మెగా ర్యాలీలు మాస్టర్స్ నాతో చేయించారు. 2017లో మళ్ళీ నాకు "మౌనంగా ఉండాలి" అనిపించింది. కానీ పత్రిసార్ నాకు ఆ అవకాశం ఇవ్వలేదు. "2017 నవంబర్ 11 పత్రిసార్ పుట్టినరోజు గుంటూరులో రెండురోజులు ‘శాకాహార ర్యాలీ’ జరుగుతుంది" అన్న రోజు నుంచీ గుంటూరు చుట్టుప్రక్కల గ్రామాలలో ర్యాలీలు నిర్వహించడం, ధ్యానం క్లాస్ పెట్టడం, గుంటూరులో వివిధ ప్రాంతాలలో ఇప్పటివరకు 12 ర్యాలీలు నిర్వహించడం "ఇవన్నీ నేను చేయలేదు, ప్రకృతి నా ద్వారా చేయిస్తోంది" అని భావించాను. "నేను ‘సేవ’ చేయాలి" అన్న ఒక్క సంకల్పం దృఢంగా పెట్టుకున్నాను! ధ్యానం చేస్తే ఆనందం .. ప్రచారం చేస్తే ఆనందతాండవంలో మునిగి తేలుతున్నాను! ఈ అవకాశాన్ని ఇచ్చిన జగద్గురువు బ్రహ్మర్షి సుభాష్ పత్రీజీకి సహస్రకోటి ప్రణామాలు తెలుపను కానీ, "సేవలో సార్ కన్నా ఎక్కువగా ‘సేవ’ చేయాలి అని బాగా నిర్ణయించుకున్నాను. అందరినీ "గురువు గారిని మించిన శిష్యులుగా తయారుకావాలి" అని కోరుతున్నాను.

 

D.మల్లేశ్వరి

 గుంటూరు పట్టణం
-9666897139.

 

 

 

Go to top