"అడుగడుగునా అద్భుతాలు సృష్టించిన కాశీ ధ్యానప్రచార యాత్ర"

 

నా పేరు "రజితవాణి". నేను, ఆర్మూర్ సీనియర్ "రణవీర్", వారి కుటుంబసభ్యులు, ఇతర మాస్టర్లు మొత్తం పది మంది కలిసి గ్రాండ్ పిరమిడ్ మాస్టర్ రామరాజు, అలహాబాద్ గారి ఆహ్వానం మేరకు గురుపూర్ణిమ సందర్భంగా "కాశీ"లో ధ్యాన ప్రచారం చేయాలనే ఉద్దేశ్యంతో జూలై 5వ తేదీన బయలుదేరాము.

బయలుదేరిన మొదటిరోజునుంచే మాకు అడుగడుగునా అద్భుతాలు జరిగాయి. అద్భుతాలు, అనుభవాలు "ధ్యాన జగత్"ద్వారా అందరికీ పంచాలనే ఉద్దేశ్యంతో మా యాత్ర విశేషాలను మీ అందరికీ తెలియజేస్తున్నాము.

పదిమందిగల మా బృందంలో అందరూ ప్రతిరోజూ ధ్యానం చేసి ఎంతోశక్తిని సంపాదించిన వారే. ఆస్ట్రల్ మాస్టర్స్‌తో అనుబంధం కలిగినవారే. మాస్టర్స్ అడుగడుగునా మా బృందానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిరంతరం సందేశాలను ఇస్తూ మాకు మార్గదర్శకత్వం చూపుతూ యాత్రలో అనేక అద్భుతాలు సృష్టించారు!

మొదటగా కాశీయాత్రకు బయలుదేరినప్పుడు మేము రైలులో అడ్వాన్స్ బుకింగ్ చేసుకోలేదు. రిజర్వేషన్ అసలే లేదు. మేమందరం జనరల్ బోగీలో ప్రయాణించినా మాకు రిజర్వేషన్ బోగీలో లభించినట్లుగా బెర్త్‌లు దొరకడం ఎంతో గొప్ప అనుభవం!

అలహాబాద్‌కు చెందిన ఒకానొక పిరమిడ్ మాస్టర్ .. మాకు ఎలాంటి పరిచయం లేకున్న మేము వస్తున్నామని తెలిసిన వెంటనే మా కోసం సకల సౌకర్యాలున్న నివాసం, భోజనాలు ఏర్పాటు చేయడం మరింత ఆశ్చర్యకరం!

మా బృంద సభ్యులకు తోడుగా ఆస్ట్రల్ మాస్టర్ అయిన "ఆంజనేయస్వామి" ఉంటూ, ప్రతిరోజూ సందేశాలు ఇవ్వడం ఎంతో గొప్ప అనుభవం! ఆయనే స్వయంగా మాకు తోడు ఉంటూ ఎక్కడెక్కడ ధ్యానం చేయాలో, ఎక్కడేక్కడ ధ్యానప్రచారం చేయాలో సూచించారు!

మొదటిరోజు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకుని అక్కడికి వచ్చిన 30 మంది తెలుగు వారికి ధ్యానం చెప్పడం, వారికి ధ్యాన అనుభవాలు వివరించడం జరిగింది.

ప్రతిరోజూ జరిగే "గంగాహారతి"లో ఎంతోమంది ఉన్న మొదటి వరుసలో మాకు స్థలం లభించడం. అక్కడ ఉన్న వారికి ధ్యానం చెప్పడం ఎంతో మంచి అనుభవం! గంగానదిలో పడవ ప్రయాణం చేసేటప్పుడు జోరుగా వర్షం పడింది. ఈ వర్షపు జల్లులు మాకు అమృత ధారల వంటివని స్వయాన గంగామాతయే సెలవు ఇవ్వడం, సమస్త దేవతల మాతోపాటే ధ్యానం చేయడం మా యాత్రలోనే అద్భుతమైన అనుభవం!

మా బృంద సభ్యులకు ఆస్ట్రల్ మాస్టర్లయిన శ్రీ వేంకటేశ్వరస్వామి, లక్ష్మీమాత, సరస్వతి, గణపతి, ఆంజనేయస్వామి, శివ ఎన్నో సందేశాలు ఇవ్వడం జరిగేది. వారి సందేశాలకు అనుగుణంగా కాశీలో ఉన్న ప్రతి గుడిలో ధ్యానం, ధ్యాన ప్రచారం చేయడం జరిగింది.

ధ్యానప్రచారంలో భాగంగా కాశీలో ఉన్న "కాలభైరవ స్వామి" గుడిలో ధ్యాన ప్రచారం చేయడం మరిచిపోతే .. మా సభ్యులకు వెంటనే ఆదేశాలు వచ్చి "అక్కడ మీ బృంద సభ్యులు తప్పనిసరిగా ధ్యానం, ధ్యానప్రచారం చెయ్యాలి" అని చెప్పడం అందరికీ ఆశ్చర్యపరిచింది.

ధ్యానయాత్రలో భాగంగా జూలై 9వ తేదీన "గురుపౌర్ణమి" సందర్భంగా కాశీలో ఏర్పాటు చేసిన ధ్యాన కార్యక్రమనికి గ్రేట్ మాస్టర్ కళాధర్‌రెడ్డి గారు వచ్చి సందేశాలు, అనుభవాలు ఇవ్వడం ఎంతో ఉపయోగపడింది. ఈ కార్యక్రమంలో అలహాబాద్‌కు చెందిన 15 మంది మాస్టర్లు పాల్గొన్నారు!

మేము ధ్యానం చేస్తూన్న సమయంలో ఆకాశంలో అనేకమంది బుద్ధుళ్ళు వలయంగా ఏర్పడి మాతో ధ్యానం చేశారు. యాత్ర చేసేటప్పుడు పత్రీజీ మాట్లాడి మాకు మరింత ఉత్సాహపరచి యాత్ర సంపూర్ణం కావడానికి కావలసిన శక్తిని అందించారు.

ఇంతవరకు ధ్యానం చేయడం వల్ల కల్గిన లాభాలకంటే కాశీలో ధ్యాన ప్రచారం చేయడం వల్ల మా శక్తి మరింత రెట్టింపు అవ్వడమే కాక, మా ఆలోచనలే మా వాస్తవ రూపంలోకి రావడం మాకు ఎంతో ఆశ్చర్యం కలిగించింది.

నేను, నాతోపాటు ఆర్మూర్ సీనియర్ మాస్టర్ కుటుంబ సభ్యులు రణవీర్, సింధు, యజ్ఞతేజ, ప్రీతమ్, చేపూర్ మాస్టర్లు కిరణ్, విజయలక్ష్మి, త్రిషిల్, నికిల్, త్రివేణి అందరూ చక్కటి ధ్యానం, ధ్యాన ప్రచారం చేసి తమ తమ జీవితాలను ముక్తి మార్గంవైపు నడిపించుకున్నారు.

 

రజితవాణి
 బోధన్ - నిజామాబాద్ జిల్లా
9618457251

Go to top