"ధ్యానంతో జన్మ ధన్యం"

 

నా పేరు "గోపాల్". వృత్తిరీత్యా RMP డాక్టర్‌గా పనిచేస్తూన్న నేను అనేకానేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతూ 2000 సం||లో పిరమిడ్ ధ్యానంలోకి రావడం జరిగింది.

వెంటనే ధ్యాన-శాకాహార కుటుంబంగా మారి నా భార్య జయంతి, కొడుకులు నరేష్ (B.Pharm) గంగాధర్, కూతురు విజయనిర్మల తో కలిసి మా గ్రామంలో ఇంటింటికీ మరి స్కూల్స్‌కీ వెళ్ళి ధ్యానం - శాకాహారం గురించి చెప్పడం మొదలుపెట్టాం.

ధ్యానంలోకి రాక మునుపునుంచే నా చేతి మణికట్టు దగ్గర ఒక కణితి ఉండేది. ఎన్ని మందులు వాడినా తగ్గని ఆ కణితి కేవలం ఒక చిన్ని ధ్యాన సంకల్పంతో మరి ధ్యానశక్తితో తగ్గిపోయింది. దానితోపాటు నా గొంతునొప్పి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా తగ్గిపోయాయి.

ఒకరోజు రాత్రి మా తల్లితండ్రులు పెంకుల షెడ్‌లో పడుకుని ఉండగా .. ఎవరో ఆస్ట్రల్ మాస్టర్ వచ్చి నిద్రపోతూన్న నన్ను తట్టిలేపి "షెడ్ పడిపోతుంది" అని చెప్పారు. దిగ్గున లేచిన నేను వెంటనే గాఢనిద్రలో ఉన్న మా తల్లితండ్రులను లేపి ఇవతలికి తీసుకుని రాగానే షెడ్ కూలిపోయింది.

2004వ సం||లో ఒకసారి మా గ్రామంలో ప్రజలంతా పెద్ద జాతర జరుపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే సమయంలో మేము సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో జరుగుతూన్న "ధ్యానమహాయజ్ఞం"లో పాల్గొని .. మా ఊరి పెద్ద జాతరలో జంతుహింస జరుగకూడదనీ, తీపి పదార్థాలతో జాతర జరగాలనీ సంకల్పించుకున్నాం. ఆశ్చర్యంగా మేము గ్రామం తిరిగి వచ్చేసరికి తెలిసిన వార్త "పెద్ద జాతర ఆగిపోయింది" అని.

ఈ మధ్యనే మేము మా ఇంటిపై "శ్రీ శ్రీ వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరాన్ని" నిర్మించగా జూన్ 13వ తేదీన "పత్రీజీ" వచ్చి దానిని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అనేకానేక సమస్యలతో సతమతమవుతూన్న మాలాంటి వారెందరికో ధ్యాన మార్గాన్ని చూపించి మా జన్మలను ధన్యం చేస్తోన్న పత్రీజీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.

***

నా పేరు "జయంతి". 2000 సంవత్సరంలో నేను కర్నూల్ చంద్రశేఖర్ శర్మ గారి ద్వారా ధ్యానం నేర్చుకున్నాను. నాకు TB ఉందని తెలిసింది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు నేను చాలా బలహీనంగా ఉన్నాననీ, రక్తం చాలా తక్కువ ఉందనీ చెప్పి మందులు ఇచ్చారు. ప్రతిరోజూ మాంసాహారాన్ని, గ్రుడ్లనూ తినమనీ .. "అదే బలవర్ధకమైన ఆహారం" అనీ చెప్పారు.

కానీ నేను ధ్యానశక్తిపై ఉన్న గొప్ప నమ్మకంతో గురువు గారిపై విశ్వాసంతో "కేవలం ధ్యానం మరి శాకాహారాల ద్వారా మాత్రమే జబ్బును తగ్గించుకుంటాను" అని సంకల్పించుకున్నాను.

అంతే! మెల్లిమెల్లిగా నా వ్యాధి తిరుగుముఖం పట్టింది! రోజుకు 6 గం||ల చొప్పున ధ్యాన సాధన చేసుకుంటూ అతి తక్కువ కాలంలోనే నేను సంపూర్ణ ఆరోగ్యవంతురాలిని అయ్యాను. ఆ తరువాత పరీక్ష చేసి చూసిన డాక్టర్ల రిపోర్టులన్నీ నార్మల్‌గా ఉండడం మరి రక్తశాతం చక్కగా పెరగడం చూసి ఆశ్చర్యపోయారు. దానితోపాటు ఎన్నో సంవత్సరాల నుంచి నన్ను బాధిస్తూన్న అరికాళ్ళ మంటలు తగ్గిపోయాయి. ఇప్పుడు నేను హాయిగా నిద్రపోతున్నాను.

 

డా|| గోపాల్/జయంతి 
ఉదండాపురం
ఇటిక్యాల మండలం - గద్వాల్

Go to top