"అంతా ధ్యాన మహిమ"

 

నా పేరు "మధు ". వృత్తిరీత్యా నేను కారు డ్రైవర్‌ను .. మరి ఓ డ్రైవింగ్ స్కూల్‌ను నడుపుతున్నాను. గత 32 సంవత్సరాలుగా ఎటువంటి రిమార్క్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నాను.

అలాంటి నేను జూన్ 24వ తేదీన వినుకొండ నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరాను. మార్గమధ్యంలో ఇబ్రహీంపట్నం దర్గా దగ్గర 44 సం||ల వయస్సుగల ఓ మహిళ నా కారుకు తగిలింది.

నేను వెంటనే ఆమె బంధువుల సహాయంతో ఆమెను ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్చాను. ప్రైవేట్ హాస్పిటల్ వారు వైద్యం మొదలుపెట్టడానికి ముందుగా రు.30,000/- లు అడ్వాన్సు కట్టమన్నారు.

అంత డబ్బు మా దగ్గర లేదు. కారు ఓనరు కూడా అందుబాటులో లేడని చెప్పాను. ఆ మహిళ బంధువులు అర్థం చేసుకుని "ఇంత డబ్బులు ఖర్చు పెట్టలేం" అని కోమాలోకి వెళ్ళిన ఆ మహిళను హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించడం జరిగింది.

ఆమె కోమాలో ఉన్నప్పటికీ ఆమె బంధువులు నన్ను ఒక్క మాట కూడా అనలేదు! పరిస్థితిని అర్థం చేసుకుని నన్ను వినుకొండకు వెళ్ళి ఓనరుతో చెప్పి ఖర్చులకు డబ్బులు తెచ్చుకోమని ఎంతో ప్రేమతో చెప్పారు! వినుకొండ వస్తున్నానని నేను ఫోన్ చేసి చెప్పగా కారు ఓనరు "నువ్వు అక్కడే ఉండు నేనే హైదరాబాద్‌కు వస్తున్నా" అన్నారు.

గాయపడిన మహిళకు ఇద్దరు అమ్మాయిలు, మతిస్థిమితం లేని అబ్బాయి ఉన్నాడనీ, భర్త లేడనీ తెలుసుకున్నాం. మతి స్థిమితం లేని ఆమె భిక్షాటన చేసుకుని జీవిస్తోందట.

నావైపు నుంచి కారు R.C. & I.C. & Driving Licence అన్నీ సరిగ్గా ఉన్నాయి. కనుక ప్రమాద భీమా క్రింద ఆ మహిళకు ఆర్థికసహాయం 3 లక్షల నుంచి 4 లక్షల వరకు వస్తుంది. కనుక ఇబ్రహీం పట్టణం పోలీసు స్టేషన్‌లో FIR ఫైల్ చేయించి మేము తిరిగి వినుకొండకు వచ్చాం.

తెల్లవారితే జూన్ 26 రంజాన్ పండుగ రోజున కోమా స్థితి నుంచి ఆమె రాత్రి 1.30 గం||లకు భూలోక యాత్ర ముగించిందని వాళ్ళ బంధువులు ఫోన్ చేశారు. మనిషి చనిపోయిన తరువాత కూడా వాళ్ళు, వాళ్ళ బంధువులు నన్ను ఒక్కమాట కూడా అనలేదు! ఇంకా పోలీసులతో "డ్రైవర్ మాకు బాగా సహాయం చేశాడు" అని చెప్పారు.

FIR వ్రాసిన తరువాత జూలై 7 వ తేదీన బెయిల్‌కు అప్లై చేశాను. సాయంత్రం 4.40 గం||లకు బెయిల్ వచ్చింది. సరిగ్గా 4.42 గం||లకు హైకోర్టు నుండి మెజిస్ట్రేట్ గారికి "ఈ క్షణం నుంచి క్యాష్ కట్టించుకుని బెయిల్ ఇవ్వవద్దు. ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్లు తీసుకుని మాత్రమే బెయిల్ ఇవ్వాలి" అని క్రొత్త ఉత్తర్వులు వచ్చాయి!

రెండు నిమిషాల ముందు నాకు బెయిల్ రాకపోతే .. శని, ఆదివారాలు శెలవు. తప్పనిసరిగా చంచల్‌గూడా జైలుకు వెళ్ళవలిసిందే. అలా జరుగలేదు. "ఇదంతా ధ్యాన మహిమ; మరి వందకు వంద శాతం ‘గురు కృప’" అని ఖచ్చితంగా నమ్ముతున్నాను.

మనం ‘సత్యం’ లో జీవిస్తున్నంత కాలం ‘దైవం’ మనల్ని కాపాడుతుంది. సార్ పుట్టిన రోజునాటికి అంటే తేదీ 11.11.2017 నాటికి నేను "శాకాహార ప్రచార వాహనం" కొనాలని నిర్ణయించుకున్నాను.

 

G. మధు

 వినుకొండ - గుంటూరుజిల్లా
- 9866126510.

Go to top