"UK లో పిరమిడ్ మెడిటేషన్ ఫౌండేషన్"

 

2003వ సంవత్సరంలో నేను నా భార్య "హిమబిందు"తో కలిసి అమెరికా దేశం సియాటిల్ నుంచి తిరిగివచ్చి బెంగళూరులో స్థిరపడ్డాను. పిరమిడ్ వ్యాలీలో "మైత్రేయ బుద్ధా మెగా పిరమిడ్" నిర్మాణం జోరుగా సాగుతూన్న రోజులవి! క్రమం తప్పకుండా వ్యాలీని సందర్శిస్తూ .. అక్కడి పిరమిడ్ మాస్టర్ల ధ్యానానుభవాలను వింటూంటే మాకు చాలా అద్భుతంగా ఉండేది!

అప్పటికి మా వివాహం జరిగి పది సంవత్సరాలు దాటినా మాకు పిల్లలు కలుగలేదు. ఎప్పుడయితే ధ్యానం ద్వారా మాలో మానసిక ఒత్తిడి తగ్గిపోయి, జీవిత లక్ష్యం పట్ల స్పష్టమైన అవగాహన వచ్చి ఆత్మానందానికి దగ్గరయ్యోమో! అప్పుడిక మాకు 2009లో మరి 2013లో ఒక్కరొక్కరుగా ఇద్దరు చిన్నారులు జన్మించారు .. సరియైన ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం కూడా మాకు ఎంతగానో సహకరించింది!

అంతేగాదు అసలు నేను కలలో కూడా ఊహించని మా IT కంపెనీ "వైస్ ప్రెసిడెంట్" హోదా నా నలభయ్యవయేట నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఉద్యోగరీత్యా నేను ప్రపంచంలోని అనేక దేశాలను సందర్శించే అవకాశం కూడా కలిగింది.

ఈ క్రమంలోనే నేను నా భార్య "హిమబిందు"తో కలిసి PSSM వెబ్‌సైట్లను నిర్వహించడంలో "Meditation Everywhere" పుస్తకాన్ని ప్రచురించడంలో మరి 2014-15 సంవత్సరాలలో పిరమిడ్ వ్యాలీలోని GCSS కార్యక్రమాలను నిర్వహించడంలో ముఖ్యపాత్రను పోషించాం!

2016వ సంవత్సరంలో నేను పనిచేస్తూన్న IT సంస్థ నన్ను లండన్‌కు బదిలీపై వెళ్ళమని సూచించగా పత్రీజీ సలహా మేరకు ఇక్కడికి తరలి వచ్చేశాము. నా భౌతిక మరి ఆధ్యాత్మిక జీవితాలు రెండూ కూడా ఇలా అద్బుతంగా సాగుతూ నాకు ఎనలేని ఆత్మ సంతృప్తిని అందిస్తున్నాయి. ఇంత గొప్పగా జీవించే ధ్యానజ్ఞానమార్గాన్ని నాకు చూపించిన పత్రీజీకి ధన్యవాదాలు.

 

సాయికృపాసాగర్

 లండన్ - UK

e-mail: This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.
+447717301481.

Go to top