"ధ్యాన ఉస్మానియా ప్రాజెక్ట్"

 

నా పేరు "రాము". నేను "ఉస్మానియా యూనివర్సిటీ" లో M.Sc. (maths), M.Sc. (physics) పూర్తి చేశాను. ధ్యానంలోకి 2001వ సంవత్సరంలో "బుద్ధా పిరమిడ్ ధ్యానకేంద్రం" అనే పుస్తకం ద్వారా వచ్చాను.

ధ్యానంలోకి రావడానికి ముందు నేను అనేక ఆధ్యాత్మిక సంస్థలకు వెళ్ళి ఎన్నో పుస్తకాలు చదివాను. అందులో భాగంగా "సూక్ష్మశరీరయానం" గురించి తెలుసుకున్నాను. ఎలాగైనా ఈ విద్యను నేర్చుకోవాలనుకుని ఎన్నో పుస్తకాలు, మరెన్నో సంస్థలు తిరగడం జరిగింది.

చిన్నప్పటి నుంచి నాకు యోగవిద్య, ధ్యానం, ఆధ్యాత్మికం లాంటి విషయాలపట్ల చాలా ఆసక్తి ఉండేది. ఈ అన్వేషణలో నాకు ఈ పుస్తకం ద్వారా "PSSM" మరి "ధ్యానశాస్త్రం", పరిచయం జరిగింది. "ధ్యానప్రచారం" అంటే నాకు చాలా ఇష్టం. ఇందులో భాగంగా "ఉస్మానియా యూనివర్సిటీ"లో ధ్యానం చెప్పే అవకాశం లభించింది. అప్పటికే ఉస్మానియా యూనివర్సిటీ లో మా స్నేహితులు పరశురామ్, బుచ్చిబాబు ధ్యానతరగతులను ఏర్పాటు చేసేవారు. వారితో కలిసి మొదటిసారిగా 41రోజుల ధ్యానతరగతులను జరిపేవాళ్ళం.

అప్పటినుంచి "ధ్యాన ఉస్మానియా ప్రాజెక్ట్" పేరుతో నా స్నేహితులు మరి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి కొన్ని వేలమంది విద్యార్థులకు ధ్యానం నేర్పించడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో ధ్యానం నేర్చుకున్నవాళ్ళు చాలామంది ప్రభుత్వ ఉద్యోగాలను పొందారు. గ్రూప్-2, గ్రూప్-1 మరి పోలీస్ డిపార్ట్‌మెంట్‌లలో చాలామంది కాంపిటీటివ్ పరీక్షలు వ్రాసి విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందగలిగారు.

ఈ ప్రాజెక్ట్‌లో ముఖ్యంగా నా వెన్నంటి ఉండి నాకు ప్రతి విషయంలో సహకరించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు "పరశురామ్" .. "రంజిత్" .. "బుచ్చిబాబు" .. "ప్రదీప్" .. "హరి" మరి నా భార్య పిరమిడ్ మాస్టర్ "జయవాణి" గార్లకు ప్రత్యేక ధన్యవాదాలు.

"ధ్యాన ఉస్మానియా ప్రాజెక్ట్"కి మొదటి నుంచి మా వెంటనే ఉంటూ అడుగడుగునా మాలో ఒకరిగా కలిసిపోయి మాకు moral గా, financial గా సలహాదారులుగా support చేస్తూ ముఖ్య పాత్ర పోషించిన శ్రీమతి రమాదేవి, శ్రీ శ్రీనివాస్ (తార్నాక) దంపతులు .. వీరిద్దరినీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరూ "mummy, daddy" అని పిలుచుకుంటారు .. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను!

"ధ్యాన ఉస్మానియా ప్రాజెక్ట్" లక్ష్యాలు:
* ఉస్మానియా యూనివర్సిటీలో అందరికీ ధ్యాన శాస్త్రాన్ని పరిచయం చెయ్యడం.
* పాఠశాలలు, కళాశాలలోని విద్యార్థులకు మరి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని బోధించడం.
* ఉస్మానియా యూనివర్సిటీలో "Pyramid Students Union"ని ఏర్పాటుచేసి ప్రతి విద్యార్థి నీ భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా .. ఉన్నతంగా తీర్చిదిద్దడం.
* ఒకానొక సమగ్రమైన "National Spiritual Education Policy"ని: "జాతీయ ఆధ్యాత్మిక విద్యావిధానాన్ని" తీసుకువచ్చి ఆధ్యాత్మికతకు పుట్టినిల్లయిన భారతదేశంలో ప్రతి విద్యార్థికీ స్కూలు స్థాయి నుంచి PG వరకు ధ్యానశాస్త్రం మరి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఒక సబ్జెక్ట్‌గా బోధించేలా విద్యా విధానాన్ని సవరించమని ఉద్యమించడం.
* భారతదేశంలోని ప్రతి యూనివర్సిటీలోనూ విధిగా ఒక "స్పిరిచ్యువల్ సైన్స్"డిపార్ట్‌మెంట్ ఏర్పాటు కావడానికి కృషి చేయడం.


T. రాము 

హైదరాబాద్
- 87128 44470

Go to top